ఈ పుట ఆమోదించబడ్డది

పెరుమాళ్ల సన్నిధి ఒకటి శిధిలముగా నున్నది. మీనమాసం హస్తా నక్షత్రము, తీర్థోత్సవం. ఈ సన్నిధికి తూర్పున 5 కి.మీ దూరంలో నాచ్చియార్‌కోవెల కలదు. ఈ క్షేత్రమునకు దక్షిణ జగన్నాథమని పేరు.

మార్గము: 1 కుంభఘోణం నుండి టౌన్ బస్ కలదు.2. కుంభకోణం నుండి "కొడుక్కి" అనుచోట దిగి 2 కి.మీ దూరము నడిచియు సన్నిధిని సేవింపవచ్చును.

పా|| తీదఱు నిలత్తొడెరి కాలికొడునీర్ కెళువిశమ్బు మవై యాయ్,
     మాశఱు మనత్తి నొడఱక్క మొడిఱక్కై యవైయాయ పెరుమాన్ తాయ్
     శెఱువలైన్దు తయిరుణ్డు కుడమాడు తడమార్వర్ తగై శేర్
     నాదనుఱై కిన్ఱనకర్ నన్దిపుర విణ్ణ గరుమ్‌ నణ్ణు మనమే.
            తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 5-10-1

22. తిరు విందళూరు 22 (మాయావరం)

(తిరువళందూర్)

శ్లో|| శ్రీ మదిందు సరసీకృతద్భుతా విందళూర్‌పురి సురేన్ద్ర దిజ్ముఖః
    దివ్యగంధ వననాథ నామకః చంద్రశాప వినివర్తన ప్రియః

శ్లో|| వేద చక్రపద దేవయానగో వీరనామ శయనావలాంచనః
    చంద్రసేవిత తనుర్విరాజతే కౌస్తుభాంశ కలి జిన్ముని స్తుతః

వివ: సుగంధ వననాధుడు, మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్ - చంద్రశాప విమోచన నాచ్చియార్ - పుండరీకవల్లి నాచ్చియార్ - వేదచక్ర విమానము - చంద్ర పుష్కరిణి - తూర్పుముఖము - వీరశయనము - చంద్రునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: మీనం హస్త తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం. తులా మాసమున కావేరీ స్నానము మిక్కిలి విశేషము.

మార్గము: ఇది మాయవరం నగరంలో ఒక భాగము టౌన్ బస్ సౌకర్యము గలదు. మాయవరంలో అన్ని వసతులు కలవు.

పా|| నుమ్మైత్తొழுదోమ్‌ నున్దమ్ పణిశెయ్‌దిరుక్కుమ్‌ నుమ్మడియోమ్‌
     ఇమ్మైక్కిన్బమ్‌ పెత్తిమైన్దా యిన్దళూరీరే
     ఎమ్మైక్కడితా క్కరుమమరుళి ఆవారెన్ఱి రజ్గి
     నమ్మై యొరుకాల్ కాట్టి నడన్దాల్ జాజ్గళుయ్యోమే
                      తిరుమంగై యాళ్వార్ - పెరియ తిరుమొழி 4-9-1.

                                                33