ఈ పుట ఆమోదించబడ్డది

రాక్షసుడు అపహరించిన స్వామి వైరముడిని గరుడాళ్వార్ తీసికొని వచ్చు చుండగా ఆ యుద్ధములో కిరీట శిఖిరమందలి మణి అచటనున్న నదిలో పడినది. కావున ఆ నదికి మణి ముక్తా నదియను పేరు వచ్చినది. స్వామి వైరముడి నేటికిని శిఖరము లేక యున్నది. తిరుమంగై ఆళ్వార్లకు పెరుమాళ్లు పంచ సంస్కారములను అనుగ్రహించిన దేశము. ఈ సన్నిధిలో రాతి గరుడ వాహనము కలదు. మొదట నలుగురు స్వాములచే గర్భాలయము నుండి తీసికొని రాబడి, 16 మందిచే వాహన మంటపమునకు, 32 మందిచే అలంకార మంటపమునకు వేంచేపు చేయబడి అచట పెరుమాళ్లను వేంచేపు చేసి అలంకారమైన పిమ్మట 200 మంది శ్రీపాత్తాంగులతో తిరువీధి ఉత్సవము జరుగు సందర్బము అతి విలక్షణమైనది. ఈ ఉత్సవము వైకుంఠ ద్వాదశినాడు; కుంభమాస బ్రహ్మోత్సవములో 5వ రోజున రాత్రి జరుగును.

మార్గము: కుంభఘోణం నుండి టౌను బస్ కలదు. 10 కి.మీ. ఉప్పిలియప్పన్,తిరుచ్చేరైల నుండియు సేవింపవచ్చును.

1. పెడై యడర్త మడ వన్నమ్‌ పిరియాదు; మలర్కమలమ్
    మడ వెడుత్త మదునుకరుమ్‌ వయలుడుత్త తిరువఱైయూర్
    ముడై యడర్త శిరమేన్ది మూవులగుమ్‌ పలితిరివోన్
    ఇడర్ కెడుత్త రువాళినిణై యడియే యడైనెంజే.

2. కులై యార్‌న్ద పళుక్కాయుమ్‌ పశుజ్గాయుమ్‌ పాళైముత్తుమ్‌
    తలై యార్‌న్ద విళజ్గముగిన్ తడంజోలై త్తిఱునఱైయూర్
    మలై యార్‌న్ద కొలంజోర్ మణిమాడ మిగమన్ని;
    నిలై యార నిన్దాన్ఱన్ నీళ్‌కழలే యడై నెంజే
            తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొழி 6-9-1,8

21. నందిపుర విణ్ణగరమ్‌ 21(కుంభకోణం 10 కి.మీ)

(నాథన్ కోయిల్)

శ్లో. నంది పూర్వ పుర విణ్ణగర్ పురే నంది తీర్థయుజి పశ్చిమాసను:|
   నాధనాధ ఇతి నామ సమ్యుతో నంది భక్తశిబిరాజ సేవిత:||

శ్లో. శ్రీమచ్చంపక వల్లీతి నాయక్యా పరిశోభిత:|
   మధ్యే మన్దార వైమాన మాప్తే శ్రీ కలిజిన్నుత:||

వివ: విణ్ణగర పెరుమాళ్-నాథ నాథ పెరుమాళ్-చంపకవల్లి తాయార్-నంది పుష్కరిణి-మన్దార విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-నందికి శిబికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు తూర్పున 1. కి.మీ. దూరమున నందివనమను చోట

                                                   32