ఈ పుట ఆమోదించబడ్డది

19. తిరునాగై (నాగ పట్టణమ్‌) - 19

శ్లో. సౌందర్య రాజ భగవాన్ తిరు నాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్‌|
   సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత సౌందర్య నామ వరమన్దిర మధ్యవాస:|
   సంస్థాన వేష రుచిరో భుజగాధి రాజ: శ్రీ మత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తి:|
   ప్రాచీముఖ:కలిజిదాహ్వయ సూరి కీర్త్య:భక్తేష్ట దాన నిపుణో భువిరాజతేసౌ||

వివ: సొందర్య రాజ పెరుమాళ్-సౌందర్యవల్లి తాయార్-సార పుష్కరిణి-సౌందర్య విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను. మీన మాసం ఉత్తరా నక్షత్రమున తీర్దోత్సవము. ఈ క్షేత్రమునకు పశ్చిమముగా 10 కి.మీ దూరంలో "తిరుక్కణ్ణంగుడి" యను క్షేత్రము కలదు.

మార్గము: నాగపట్నం ప్రసిద్ది చెందిన పట్నము. వసతులున్నవి. బస్‌స్టేషన్‌కు ఎదుటవీధిలోనే సన్నిధి గలదు. మాయవరం నుండి వచ్చి సేవించుటయు సౌకర్యము.

పా. పొన్నివర్ మేని మరదకత్తిన్ పొజ్గిళంజోది యకలత్తారమ్‌
    మిన్;ఇవర్ వాయిల్ నల్ వేదమోదుమ్‌ వేదియర్ వానవరావర్ తోழி
    ఎన్నైయుం నోక్కి యెన్నల్గులమ్‌ నొక్కి యేన్దిళజ్గోజ్గెయుం నోక్కుకిన్నార్
    అన్నైయెన్కోక్కుమొన్ఱఇజగిన్ఱేన్ అచ్చోవొరు వరழగియవా
           తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 9-2-1

20 తిరునఱైయూర్ 20

(కుంభకోణం 10 కి.మీ)

శ్లో. నరయూర్ పరిపూర్ణ నామకే మణిమక్తాఖ్య తరంగిణీ తటే|
   త్రిదేశే ప్రధిశాముఖస్థితి: వరనంబిక్కలతా సమన్విత:|

శ్లో. శ్రీనివాసే విమానస్దో మేధావి మునిసేవిత:|
   కలిజిమ్మని సంకీర్త్య రాజతే భక్తవత్సల:||

వివ: నంబి-నంబిగై నాచ్చియార్-మణిముక్తానది-శ్రీనివాస విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మేధావి మునికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తాయార్లకు ప్రాధాన్యత గల క్షేత్రము. ఇచ్చటి పెరుమాళ్లకు శ్రీనివాసన్, వాసుదేవన్, పరిపూర్ణన్, నంబియను తిరునామములు కలవు. తాయార్ ఉత్సవర్ వంజుళవల్లి. ఇచట పెరుమాళ్లుతోపాటు సంకర్షణ, ప్రద్యుమ్న;అనిరుద్ద;పురుషోత్తములును వేంచేసి యున్నారు. బ్రహ్మకూడ వేంచేసి యున్నారు.

                                             31