ఈ పుట ఆమోదించబడ్డది

9. తిరువాదనూర్

(స్వామిమలై 3 కి.మీ)

శ్లో. ఆదమర్ నగరే దివ్యే సూర్య పుష్కరిణీయుతే
   శ్రీ రజ్గనాయకీ నాథ: ప్రణవాఖ్య విమానగ:

శ్లో. ఆండళక్కుం మెయ్యవాఖ్య: ప్రాజ్ముఖో భుజగేశయు|
   రాజతే కామధేన్వక్షి గోచరో కలిజిన్నుత: ||

వివరణ: ఆండళక్కుం మెయ్యన్-శ్రీరంగ నాయకి-ప్రణవాకార విమానము-సూర్యపుష్కరిణి-తూర్పు ముఖము-భుజంగ శయనము-కామధేనువునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

మార్గము: స్వామిమలై నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.

విశేషములు: కామ ధేనువుకు ప్రత్యక్షమగుటచే ఆదనూర్ అనిపేరు వచ్చెను. ఈ సన్నిధి అహోబిల మఠ నిర్వహణలో నున్నది. పెరుమాళ్ల శ్రీపాదములలో తిరుమంగై ఆళ్వారు కామధేనువు కలరు.

   అన్నవనై ఆదనూర్ అణ్ణళక్కుమైయనై
   నెన్నలై యిన్ఱినై నాళైయై-నీర్మలమేల్
         తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమడల్ 130


నవవిధ సంబంధములు

మంచిమాట

పరమాత్మకు జీవాత్మకు మద్యన గల సంబంధములు తొమ్మిది.అవి.
   పరమాత్మ______________జీవాత్మ_________సంబంధము


1. పిత_________________పుత్ర___________కార్యకారణ సంబంధము
2. రక్షకుడు______________రక్ష్యుడు________రక్ష్య రక్షక సంబంధము
3. శేషి_________________శేషుడు_________శేష శేషి సంబంధము
4. భర్త_________________భార్య___________భర్తృ భార్య సంబంధము
5. జ్ఞేయ________________జ్ఞాత___________జ్ఞాతృ జ్ఞేయ సంబంధము
6. స్వామి_______________దాసుడు_________స్వస్వామి సంబంధము
7. ఆధారము_____________ఆధేయము_______ఆధార ఆధేయ సంబంధము
8. ఆత్మా________________శరీరము_________శరీరాత్మ సంబంధము
9. భోక్త_________________భోగ్యము_________భోకృభోగ్య సంబంధము