ఈ పుట ఆమోదించబడ్డది

వీరు దివ్య ప్రబన్దములను భగవద్విషయమును స్వాచార్యులైన తిరువాయిమొழி పిళ్లై గారి వద్ద సేవించిరి. శ్రీబాష్యాదులను శ్రుత ప్రకాశికను కిడాంబి తిరుమలై అయ్యంగారి వద్ద సేవించిరి. తత్త్వత్రయాది రహస్యములను "కూరుకులోత్తమదాసర్" అను ఆచార్యులవద్ద సేవించిరి.

వీరు ఉడయవరుల శ్రీపాదములందు అత్యంత అభినివేశముగల వారగుటచే "యతీంద్ర ప్రవణు" లను తిరునామమేర్పడినది. మరియు మణవాళమామునులు, రమ్యజామృత మునులు, వరవరమునులు, పరయోగి, రామానుజన్ పొన్నిడి అను తిరునామములు కలవు.

వీరి సన్నిదిని ఆశ్రయించినవారు అనేకులు గలరు. వీరిలో 1. వానమామలై జీయర్ 2. పరవస్తు పట్టర్‌పిరాన్ జీయర్ 3. తిరువేజ్గడ జీయర్ 4. కోయిల్ కన్దాడైఅణ్ణన్ 5. ప్రతివాది భయంకరం అణ్ణా 6. ఎఱుంబి అప్పా 7. అప్పిళ్లై 8. అప్పుళ్లాన్ అనువారలు అష్టదిగ్గజములుగా ప్రసిద్దినొందిరి.

వీరనుగ్రహించిన గ్రంథములు 1. తత్త్వత్రయమునకు వ్యాఖ్య 2. రహస్యత్రయ వ్యాఖ్య 3. శ్రీవచనభూషణ వ్యాఖ్య 4. ఆచార్యహృదయ వ్యాఖ్య 5.జ్ఞానసార వ్యాఖ్య 6. ప్రమేయసార వ్యాఖ్య 7. పెరియాళ్వార్ తిరుమొழி వ్యాఖ్య 8.రామానుశనూత్తందాది వ్యాఖ్య 1. ఈడుకు ప్రమాణతిరట్టు 2. ఆరాయిరప్పడి ప్రమాణతిరట్టు 3. తత్త్వత్రయ ప్రమాణతిరట్టు 4.శ్రీవచనభూషణ ప్రమాణతిరట్టు.

1.ఉపదేశరత్తినమాలై 2. తిరువాయిమొழி నూత్తందాది 3. ఆర్తి ప్రబంధము 4. తిరువారాదన క్రమము(జీయర్‌పడి)

1.యతిరాజ విశంతి 2. భగవద్గీతకు గీతార్థ సంగ్రహదీపికా యను సంస్కృత వ్యాఖ్య.

వాచామగోచరమైన వీరి దివ్యప్రభావమును "యతీంద్ర ప్రవణ ప్రభావము" అనుగ్రంథమున సేవింపదగును.

వాழி తిరునామమ్

ఇప్పునియిల్ అరంగేశర్ క్కీడళిత్తాన్ వాழிయే
    ఎழிల్ తిరువాయిమొழி పిళ్లై యిణై యడియోన్ వాழிయే
ఐప్పిశియిల్ తిరుమూల త్తవదరిత్తాన్ వాழிయే
    అరపశర ప్పెరుంజోది యనన్దనెన్నుం వాழிయే
ఎప్పొழுదుమ్‌ శ్రీశైల మేత్తవందోన్ వాழிయే
    ఏరారు మెతిరాశరెన ఉదిత్తాన్ వాழிయే
ముప్పురినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాழிయే

234