ఈ పుట ఆమోదించబడ్డది

పిళ్లై లోకాచార్యులు

(లోకాచార్యులు)

తిరునక్షత్ర తనియన్:-
   తులాయాం శ్రవణేజాతం లోకార్యసుహమాశ్రయే|
   శ్రీ కృష్ణపాదతనయం తత్పదాంబుజ సమంశ్రితమ్‌||
నిత్య తనియన్:-
   లోకాచార్యయ గురువే కృష్ణపాదస్య సూనవే|
   సంసారభోగి సందష్ట జీవజీవతానే నమ:||

నమ్బిళ్లైగారి శ్రీపాదములాశ్రయించిన వారిలో వడక్కుత్తిరువీధిపిళ్లై గారొకరు. నంబిళ్లగారి మంగళా శాసనములతో వీరికిరువురు కుమారులుదయించిరి. అందు మొదటివారు పిళ్లైలోకాచార్యులు - రెండవవారు అழగియమణవాళప్పెరుమాళ్ నాయనార్ అనువారు.

పిళ్లై లోకాచార్యులవారు క్రోథ నామసంవత్సరం తులామాసం శ్రవణ నక్షత్రమున శ్రీరంగమునందవతరించిరి. తమ తండ్రిగారైన వడక్కుత్తిరువీధిపిళ్లై గారి శ్రీపాదములాశ్రయించి ఉభయవేదాన్త రహస్యములను అధికరించిరి.

పరమకారుణికులైన పిళ్లై లోకాచార్యులవారు సర్వులు తరించుటకు పురాణప్రక్రియననుసరించి అష్టాదశ రహస్యములను కృపచేసిరి. వీరిసోదరులు అழగియ మణవాళప్పెరుమాళ్ నాయనార్; ఆచార్యహృదయము; అరుచ్చెయల్ రహస్యము; తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును అనుగ్రహించిరి. వీరి శ్రీపాదము లాశ్రయించిన వారిలో తిరువాయిమొழி పిళ్లై ప్రధానులు.

తిరునక్షత్రం: తులామాసం , శ్రవణం
ఆచార్యులు: వడక్కుత్తిరువీధిపిళ్లై
అనుగ్రహించిన గ్రంథములు: అష్టాదశ రహస్యములు
శిష్యులు: తిరువాయిమొழி పిళ్లై, అழకియమణవాళప్పెరుమాళ్, నై నారాచార్యర్ మొదలగువారు.

వాழி తిరునామమ్

అత్తిగిరి అరుళాళర్ అనుమతియోన్ వాழிయే
    ఐప్పిశియిల్ తిరువోణత్త వదరిత్తాన్ వాழிయే
ముత్తి నెఱి మఱై త్తమిழாల్ మొழிన్దరుళ్ వోన్ వాழிయే
    మూదరియ మణవాళన్ మున్‌బుదిత్తోన్ వాழிయే
నిత్తియం నమ్బిళ్ళై పదం నెంజిల్ వైప్పోన్ వాழிయే
    నీళ్‌వశన బూషణత్తాల్ నియమిత్తాన్ వాழிయే
ఉత్తమమాం ముడుమ్బైనగ రుదిత్తవళ్లల్ వాழிయే
    ఉలగారియన్ పదజ్గళ్ ఊழிదోరుం వాழிయే.

231