ఈ పుట ఆమోదించబడ్డది

పెరియ వాచ్చాన్‌బిళ్లై

(శ్రీ కృష్ణదేశికులు)

తిరునక్షత్ర తనియన్:-
    సకల ద్రావిడామ్నాయ సార వ్యాఖ్యాన కారిణమ్‌|
    శ్రావణే రోహిణీ జాతం శ్రీకృష్ణ గురు మాశ్రయే||
నిత్య తనియన్:-
    శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమోయామున మాసనే
    యత్కటాక్షైక లక్ష్యాణాం సులభ శ్శ్రీధర స్సదా||

వీరు కలియుగాది 4269 సంవత్సరమునకు సరియగు సర్వజిత్ నామ సంవత్సర సింహ మాసమున రోహిణీ నక్షత్రమున శెంగనల్లూరు(తంజావూరుమావట్టం) నందవతరించిరి. (తిరువెళ్ళియజ్గుడికి సమీపము) శ్రీకృష్ణాష్టమినాడు అవతరించుటచే వీరికి కృష్ణమాచార్యులను తిరునామము కలిగినది. వీరి ఆచార్యులు నంబిళ్లై. వారి నియమనానుసారము తిరువాయిమొழிకి శ్రీరామాయణ సంఖ్యతో "ఇరుపత్తునాలాయిరప్పడి" వ్యాఖ్యానము ననుగ్రహించిరి. అంతియగాక తాము నంబిళ్లై గారి యొద్ద సేవించిన దివ్యప్రబందార్థము లన్నింటిని వ్యాఖ్యాన రూపముగా అనుగ్రహించిన మహనీయులు. వీరికి వ్యాఖ్యాతృ చక్రవర్తియని బిరుదము . "అభయప్రద రాజులనియు" బిరుదము. వీరు శ్రీరామాయణ విశేషార్థములను వివరించు తనిశ్లోకిని అనుగ్రహించిరి. వీరు సుమారు అరువది గ్రంథములు అనుగ్రహించిన మహనీయులు. (వీరి కుమారులు "నయనారాచ్చాన్‌పిళ్లై").

గ్రంథములు: 1. ఇరుపత్తునాలాయిరప్పడి 2. తత్త్వత్రయ వివరణము 3. నిగమనప్పడి 4. పరందరహస్యము 5. మాణిక్యమాల 6. మూన్ఱాయిరవ్యాఖ్య 7. రహస్య త్రయ వివరణమ్‌ 8. నవరత్నమాలై 9. సకల ప్రమాణ తాత్పర్యం 10. ఉపకార రత్నమ్‌ 11. గద్యత్రయ వ్యాఖ్యానం 12. ఆళవన్దార్ స్తోత్రవ్యాఖ్యానం 13. అభయప్రధాన వ్యాఖ్యానమ్‌ 14. చరమరహస్యమ్‌ 15. అనుసందాన రహస్యమ్‌.

వాழி తిరునామజ్గళ్

తణ్‌మై శింగం రోహిణినాళ్ తழைక్క వన్దోన్ వాழிయే
    తారణియిల్ శెంగనల్లూర్ తానుడై యోన్ వాழிయే
పున్ మై తవిఱ్కుం తిరువరంగర్ పుగழுరైప్పోన్ వాழிయే
    పూదూరెతిరాశర్ తాళ్ పుగరుమవన్ వాழிయే
మణ్‌పుగழ் శేర్ శటగోపర్ వళమురై ప్పోన్ వాழிయే
    మఱై వాలిన్ పొరుళ్ దన్నై పగుత్తురైత్తాన్ వాழிయే
అన్బుడ మలగారియర్ దం అడియిణై యోన్ వాழிయే
    అభయప్రదరాజర్ తాళ్ అనవరతం వాழிయే

230