ఈ పుట ఆమోదించబడ్డది

వడక్కుత్తిరువీథి పిళ్లై

(శ్రీ కృష్ణపాదులు)

తిరునక్షత్ర తనియన్:-
    మిధునే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితమ్‌|
    ఉదక్ర్పతోళి నిలయం కృష్ణపాదమహంభజే||
నిత్య తనియన్:-
    శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా|
    యత్ర్పపాద ప్రభావేన సర్వసిద్ధిరభూస్మమ||

వీరు సర్వజిత్ నామసంవత్సర మిధునమాసము స్వాతి నక్షత్రము నందవతరించిరి. వీరి ఆచార్యులు నంబిళ్లై. వారి సన్నిధిలో సకల దివ్యప్రబందార్థములను సేవించిరి. నంబిళ్లై ఉపన్యసించిన తిరువాయిమొழி విశేషార్థముల నన్నింటిని ఒక గ్రంధముగా గూర్చిరి. అదియే ఈడుముప్పత్తారాయిరప్పడి.

"తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్" శ్రీవిష్ణుపురాణ సంఖ్యతో ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును, నంజీయర్ శ్రీభాష్య ప్రక్రియ ననుసరించి ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్యానమును, పెరియ వాచ్చాంబిళ్లై శ్రీరామాయణ సంఖ్య ననుసరించి ఇరుపత్తునాలాయిరప్పడి వ్యాఖ్యానమును అనుగ్రహింపగా వీరు శ్రుత ప్రకాశికా ప్రక్రియగా "ఈడుముప్పత్తారాయిరప్పడి"ని అనుగ్రహించిరి.

ఈడు అనగా సదృశమని యర్థము. ఉపనిషత్తులకు సదృశమగుటచే ఈ వ్యాఖ్యకు ఈడు ముప్పత్తారాయిరప్పడియను పేరువచ్చినది. సర్వులను భగవద్గుణము లందు ఈడుపడునట్లు (అవగాహనము చేయునట్లు చేయుటచే) "ఈడు" అనిపేరు వచ్చినది. వీరి తిరుకుమారులు పిళ్లై లోకాచార్యులు, అழగియ మణవాళప్పెరుమాళ్, నై నారాచార్యర్.

తిరునక్షత్రము: మిధునం ; స్వాతి
ఆచార్యులు: నంబిళ్లై
గ్రంథము: ఈడుముప్పత్తారాయిరప్పడి.

వాழி తిరునామజ్గళ్

అనిదని ఱ్పోదినా ళవతరిత్తాన్ వాழிయే
    ఆళ్వార్గళ్ కలై ప్పొరుళై యాయ్‌న్దురైప్పోన్ వాழிయే
తానుగన్ద నమ్బిళ్లై తాళ్ తొழுవోన్ వాழுయే
    శడగోపర్ తమిழ் క్కీడు శాత్ తినాన్ వాழிయే
నానిలత్తిల్ బాషియత్తై నడత్తినాన్ వాழிయే
    నల్లవులగారియనై నమక్కళిత్తాన్ వాழிయే
ఈనమఱనెమై యాళు మిరైవనార్ వాழிయే
    ఎజ్గళ్ వడవీది పిళ్లై యిణై యడిగళ్ వాழிయే.

229