ఈ పుట ఆమోదించబడ్డది

ఆచార్యులు: శ్రీపరాశర భట్టర్
శిష్యులు: నంబిళ్లై మొదలగువారు
అనుగ్రహించిన గ్రంథములు: తిరువాయిమొழிకి "ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్య", తిరుప్పావైకు ఈరాయరప్పడివ్యాఖ్య, ఉరై, శరణాగతిగద్య వ్యాఖ్య.

వాழி తిరునామజ్గళ్

తెణ్డిరై శూழ் తిరువరజ్గమ్‌ శెழிక్క వన్దోన్ వాழிయే
     శీమాదవ నెన్నుమ్‌ శెల్వనార్ వాழிయే
పణ్‌డై మఱై త్తమిழ் ప్పొరుళై పగర వందోన్ వాழிయే
     పజ్గునియిల్ ఉత్తిర నాళ్ పారుదిత్తాన్ వాழிయే
ఒండొడియాళ్ కలవిదన్నై యొழி త్తిట్టాన్ వాழிయే
    ఒన్బది నాయిర ప్పొరుళై యోదుమవన్ వాழிయే
ఎండిశైయుమ్‌ శీర్ బట్టరిణై యడియోన్ వాழிయే
    ఎழிల్ పెరుగుమ్ న--య రిని తూழி వాழிయే

"నంబిళ్లై"

(కలివైరి దాసులు)

తిరునక్షత్ర తనియన్:-
    వృశ్చికే కృత్తికా జాతం కలివైరి గురుమ్బజే|
    వేదాన్త ముని పాదాబ్జ శ్రితం సూక్తి మహర్ణవమ్‌||
నిత్య తనియన్:-
    వేదాన్త వేద్యామృత వారిరాశే: వేదార్థ సారామృత పూరమగ్ర్యమ్‌
    ఆదాయవర్షన్త మహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలివైరి దానమ్‌||

వీరు వృశ్చికమాసమున కృత్తికా నక్షత్రమునందవతరించిరి. నంబూరి వరదరాజులనునది తండ్రిగారుంచిన తిరునామము.

వీరు నంజీయర్ శ్రీపాదముల నాశ్రయించి వారి వలన దివ్య ప్రబందార్థములధికరించిరి. నంజీయర్ అనుగ్రహించిన "ఒన్‌బదినాయిరప్పడి" వ్యాఖ్యానమును తాళ పత్రములపై తిరిగి వ్రాయు ప్రయత్నములో కావేరి నదిలో దానిని పోగొట్టుకొని తాము వినిన విషయమగుటచే తమ మేదాశక్తితో తిరిగి వ్రాసి నంజీయర్ సన్నిధిలో సమర్పించిరి. వారి మేదా విశేషమున కాశ్చర్యపడిన నంజీయర్ వీరిని "నమ్ముడైయ పిళ్లై" అని సాదరముగా మన్నించిరి. తదాది వీరికి నంబిళ్ళై యను తిరునామము ప్రసిద్ధి చెందెను. వీరికే తిరుక్కలి గన్ఱి దాసులు (కలివైరి దాసులు) అనియు లోకాచార్యులనియు తిరునామము.

227