ఈ పుట ఆమోదించబడ్డది

"ఎంబార్"

(గోవింద భట్టర్)

తిరునక్షత్ర తనియన్:-
   పుష్యే పునర్వసు దినే జాతం గోవిన్ద దేశికమ్‌
   రామానుజ పదచ్చాయా రాజహంసం సమాశ్రయే||
నిత్య తనియన్:-
   రామానుజ పదచ్చాయా గోవిన్దాహ్వానసాయినీ
   తదాయత్త స్వరూపా సా జీయాన్మ ద్విశ్రమన్ధలీ||

వీరు భగవద్రామానుజులకు పినతండ్రి కుమారులు. తండ్రిగారు "కమలనయనభట్టరు". శ్రీపెరుంబూదూరునకు సమీపమునగల మధుర మంగలమను గ్రామమున మకరమాసమున (పుష్య) పునర్వసు నక్షత్రమందవతరించిరి.

వీరు కొంతకాలము అన్యసంప్రదాయమునందుండగా వీరి మేనమామగారైన పెరియ తిరుమల నంబిగారు "తేవుమెప్పొరుళుం పడైక్క" అను తిరువాయిమొழி అర్దాను సంధానముచేత వీరిని వశీకరించుకొనిరి. ఉడయవరుల శ్రీపాదముల నాశ్రయింపచేసిరి. తదాది వీరు ఉడయవరుల శ్రీపాదములను విడువక చాయవలె అనుసరించు చుండిరి. ఉడయవర్ తరువాత దర్శన నిర్వాహకులుగా వేంచేసియుండిరి.

కూరత్తాళ్వాన్ తిరుక్కుమారులు వ్యాసభట్టరు, పరాశరభట్టరులకు మంగళాశాసనము చేయదలచిన ఉడయవరుల సన్నిధికి, ఆ బాలకులను తీసికొనిపోవుచు "ద్వయమంత్రమును" రక్షగాచెప్పిరి. స్వామి ఎంబెరుమానార్లు ఆ బాలుర తేజస్సును గమనించి ఎంబారులవలన విషయము తెలిసికొని తమకంటె ముందుగా వారి క్షేమమును కోరినవారగుటచే వారికి ఎంబారులనే ఆచార్యులుగా నియమించిరి. వీరు అనుగ్రహించిన గ్రంథము: విజ్ఞానస్తుతి.

వాழி తిరునామజ్గళ్

పూవళరుం తిరుమగళార్ పొలివుత్తోన్ వాழிయే
     పొయ్‌గై ముదల్ పదిన్‌మర్ కలై పొరుళరైప్పోన్ వాழிయే
మావళరుం బూదురాన్ మలర్పదత్తోన్ వాழிయే
     మకరత్తిల్ పునర్‌పూశమ్‌ వన్దుదిత్తాన్ వాழிయే
తేవుమెప్పొరుళుమ్‌ పడైక్క త్తిరున్దినాన్ వాழிయే
     తిరుమలై నమ్బిక్కడిమై శెయ్యుమవన్ వాழிయే
పావై యర్గళ్ కలవియిరుళ్ పగలెన్దాన్ వాழிయే
     బట్టర్ తొழுమెమ్బార్ పొఱ్పదమిరణ్డుమ్‌ వాழிయే

223