ఈ పుట ఆమోదించబడ్డది

ఉడయవర్

(భగవద్రామానుజులు)

తిరునక్షత్ర తనియన్:-
   మేషార్ద్రా సంభవం విష్ణోర్దర్శన స్థాపనోత్సుకమ్‌
   తుండీర మండలే శేషమూర్తిం రామానుజం భజే||
నిత్యతనియన్:-
   యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
   వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|
   అస్మద్గురో ర్భగవతోస్య దయైక సిన్దో:
   రామానుజన్య చరణౌ శరణం ప్రపద్యే||

వీరు తొండమండలమునగల శ్రీ పెరుంబూదూరు అను దివ్యదేశమున హరీతగోత్రులగు ఆసూరి కేశవ సోమయాజుల వారికి కాంతిమతీ దేవి యందు కుమారులుగా పింగళనామ సంవత్సర చైత్ర (మేష) శుక్ల పంచమీ గురువారము ఆర్ద్రా నక్షత్రయుక్త కర్కాటక లగ్నము నందవతరించిరి.

వీరికి తండ్రిగారు యథోచితమగు జాతకర్మాదుల నొనర్చి "ఇళై యాళ్వార్" అను తిరునామముంచిరి. వీరు శాస్త్రాభ్యాసము చేయుసమయమునందే ఒక మూగవానికి, బ్రహ్మరక్షస్సుకు మోక్షమునను గ్రహించిరి. ఉపనిషదర్థ విచారమున యాదవప్రకాశులతో విభేదించిరి.

తిరుక్కచ్చినంబిగారి ద్వారా షడ్వార్తలనువిని ఆళవందారుల శ్రీపాదములాశ్రయించిన పెరియనంబిగారిని ఆశ్రయించి మధురాంతకమున పంచ సంస్కారములను పొందిరి. పిమ్మట అనంత సరసీ తటమున వరదరాజస్వామి సన్నిధిలో తురీయాశ్రమమును స్వీకరించిరి.

పిమ్మట శ్రీరంగముచేరి శ్రీరంగనాథుల కైంకర్యము చేయుచుండిరి. తమ మేనమామగారైన పెరియ తిరుమల నంబిగారిని వద్ద శ్రీరామాయణమును సేవించిరి. వారును తమ కుమారులగు పిళ్ల తిరుమలనంబిగారి, మేనల్లుడగు "ఎమ్బార్లను" (గోవిందభట్టర్) వీరి శ్రీపాదములాశ్రయింపజేసి "కోయిలణ్ణన్" అను తిరునామముంచిరి.

తిరువరజ్గప్పెరుమాళ్ అరయర్ అనువారివద్ద దివ్యప్రబంధములు సేవించిరి. వారును వీరికి లక్ష్మణమునులు అను తిరునామముంచి తమసోదరులగు శాట్టనమ్బిగారిని వీరి తిరువడిలో నాశ్రయింపజేసిరి.

తిరుక్కోట్టియూర్ నంబిగారివద్ద రహస్య త్రయార్థమును సేవించి వారి

216