ఈ పుట ఆమోదించబడ్డది

వారిచే గానము చేయించిరి. ఆవంశమువారే నేటికిని శ్రీరంగనాథుని మ్రోల దివ్యప్రబంధమును గానము చేయు అరయరు స్వాములు.

వీరికుమారులు ఈశ్వరమునులు. వారికి కుమారులు దయింతురనియు వారికి "యమునై త్తుఱైవర్" అను తిరునామముంచవలయుననియు నియమించిరి. వారికి ద్వయమంత్రమును దివ్యప్రబంధములను చెప్పుమని తమ శిష్యులగు ఉయ్యక్కొండార్‌ను, యోగరహస్యముల నుపదేశింపుడని "కురుగైక్కావలప్పన్" అనువారిని నియమించిరి. వీరికి చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) యందు ప్రేమాతిశయము మించగా వారిని వెదకుచు గంగైకొండ చోళపురము చేరి అచట పరమపదించిరి.

వీరి తిరునక్షత్రం: మిదునం, అనురాధ
అవతారస్థలం: కాట్టుమన్నార్ కోయిల్
అనుగ్రహించిన గ్రంథములు: న్యాయతత్త్వము, యోగరహస్యము, పురుషనిర్ణయమ్‌?
శిష్యులు: ఉయ్యక్కొణ్డార్, కురుగైక్కావలప్పన్, తిరుక్కణ్ణమజ్గై యాణ్డాన్ మొదలగువారు.

వాழி తిరునామజ్గళ్

అనిదనిల్ అనుడత్తిల్ అవదరిత్తాన్ వాழிయే
       ఆళవందార్కుపదేశమ్‌ అరుళివైత్తాన్ వాழிయే
పానుతెర్కిఱ్ కణ్డవన్ శొల్ పలవురైత్తాన్ వాழிయే
       పరాజ్కుశనార్ శొర్ పిరపన్దమ్‌ పరిన్దుకత్‌తాన్ వాழிయే
గానముర తాళత్తిల్ కణ్డిశైత్తాన్ వాழிయే
       కరుణైయినాల్ ఉపదేశక్కదియళిత్తాన్ వాழிయే
నానిలత్తిల్ గురువరై యై నాట్టినాన్ వాழிయే
       వలన్తిగழு నాదముని నఱ్పదజ్గళ్ వాழுయే.

నాథేన మునినాథేన
భవయేం నాథవానహమ్‌,
యస్య నైగమికం తత్త్వం
హస్తామలకతాం గతమ్‌||

204