ఈ పుట ఆమోదించబడ్డది

తొండరడిప్పొడి ఆళ్వార్

తిరునక్షత్రతనియన్:-
   కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి కులోద్భవమ్‌|
   చోళోర్వ్యాం వనమాలాంశం భక్తవద్రేణు మాశ్రయే||
నిత్యతనియన్:-
   తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్‌
   ప్రాబోధకీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంత మీడే||

వీరు కుంభఘోణమునకు సమీపమునగల మండంగుడియను దివ్యదేశమున కలియుగాది రెండువందల తొంబదియెనిమిది సంవత్సరమునకు సమమైన ప్రభవ నామ సంవత్సర ధనుర్మాసమున (మార్గశిరము) కృష్ణ పక్ష చతుర్దశీ మంగళవారము జ్యేష్ఠా నక్షత్రమున వనమాలాంశమున అవతరించిరి.

వీరికి తండ్రిగారు "విప్రనారాయణు"లను తిరునామమునుంచిరి. వీరొకానొక పర్యాయము శ్రీరంగము వేంచేసి ఉభయ కావేరీ పరీవాహమధ్యమున పవళించియున్న శ్రీరంగనాథులను సేవించి ఆనందనిర్బరులై అందే నిత్యనివాసము చేయుచుండిరి.

వీరును పెరియాళ్వార్లవలె ప్రతినిత్యము పుష్పమాలా కైంకర్యము చేయుచుండేడివారు. అందులకై యొక నందన వనమును కల్పించిరి. వీరు కొంతకాలము "దేవదేవి" యను స్త్రీసాంగత్యము వలన మోహపరవశులై యుండియు భగవదనుగ్రహమువలన జ్ఞానోదయముకాగా సవాసనగా నితర సంబంధములన్నియు వదలి తదేక ద్యానపరులై స్వామికైంకర్యము చేయుచుండిరి. వీరనుగ్రహించిన దివ్యప్రబంధములు రెండు 1. తిరుప్పళ్ళి యెழுచ్చి 2. తిరుమాలై

ఆళ్వార్లు: తొండరడిప్పొడి ఆళ్వార్లు
అవతారము: ధనుర్మాసము, జ్యేష్ఠానక్షత్రము
అనుగ్రహించిన ప్రబంధము:తిరుప్పళ్ళియెழுచ్చి 10 పా, తిరుమాలై 45 పా
మంగళాశాసన దివ్యదేశములు: 3

నాళ్‌పాట్టు

   మన్నియశీర్ మార్‌గழிయిల్ కేట్‌టై యిన్ఱు మానిలత్తీర్!
   ఎన్నిదమ క్కేత్‌తమెనిల్ ఉరైక్కేన్-తున్నుపుగழ்
   మామఱైయోన్;తొణ్డరడిప్పొడియాళ్వార్ పిఱప్పాల్
   నాన్మఱైయోర్;కొణ్డాడుంనాళ్.

197