ఈ పుట ఆమోదించబడ్డది

పెరియాళ్వార్లు

మిధునే స్వాతిజం విష్ణో:రథాంశం ధన్విన: పురే|
ప్రపద్యే శ్వశురం విష్ణో:విష్ణుచిత్తం పురశ్శిఖమ్‌|
గురుముఖ మన ధీత్య ప్రాహనేదానశేషాన్
నరపతి పరిక్లప్తం శుల్కమాదాతుకామ:
శ్వశురమమర సంద్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి

వీరు పాండ్యదేశమునందలి "శ్రీవిల్లిపుత్తూరు" ఆను దివ్యదేశమున కలియుగాది 47వ సంవత్సరమైన క్రోదన నామ సంవత్సర మిధున (ఆషాడ)మాసము శుక్ల ఏకాదశీ భానువాసరమున స్వాతీ నక్షత్రమున పెరియ తిరువడి అంశమున (గరుత్మంతుల అంశ) శ్రీముకున్దాచార్యుల వారికి "పద్మైయార్" అను దేవియందు అవతరించిరి. వీరికి తండ్రిగారు పెట్టినపేరు. రామాండార్. భట్టనాథులనియు; విష్ణుచిత్తులనియు నామాంతరములు. వీరు సకల శాస్త్ర పారంగతులు. వైదిక నిష్ఠాగరిష్టులు కావుననే వీరికి భట్టనాథులనియు, పట్టర్ పిరాన్ అనియు పేరువచ్చినది. "వేదప్పయన్ కొళ్ళవల్ల వీట్టుశిత్తన్"; మున్నగు వాక్యములు వీరి వైదిక నిష్ఠను తెలియజేయుచున్నవి. "పీతకవాడ పీరానార్ పిరమ గురువాగివన్దు" (పీతాంబరుడే పరమాచార్యుడై వచ్చి) అనువీరి వాక్యము వలన సర్వేశ్వరునే ఆచార్యులుగా వరించి సమస్త శాస్త్రములను అదికరించిరని తెలియుచున్నధి. మఱియు అపస్తంభ ధర్మ సూత్రములకు దూర్తస్వామి రచించిన వృత్తికి వీరు వ్యాఖ్యానము చేసినట్లు పెద్దలు చెప్పుదురు.

"ప్రహ్లాదో జన్మవైష్ణవ:" అనునట్లు వీరు బాల్యము నుండి శ్రీమన్నారాయణుని పాదపద్మములందు ప్రావణ్యము కలిగియుండిరి. శ్రీవిల్లిపుత్తూరులో పెరుమాళ్లకు నిత్యము పుష్పకైంకర్యము నిర్వహించెడివారు.

పాండ్యదేశమును పరిపాలించు వల్లభదేవుని ఆస్థానమున జరిగిన విద్వద్గోష్ఠిలో శ్రీమన్నారాయణుడే పరతత్త్వమని సిద్ధాంతస్థాపన చేసి వల్లభదేవుని వైష్ణవోత్తమునిగా తీర్చిరి. తన భక్తుని కార్యమునకు మెచ్చిన సర్వేశ్వరుడు గరుడ వాహనారూడుడై వేంచేయగా "సర్వేశ్వరుని దివ్యమంగళ విగ్రహమును సేవించిన ఆళ్వార్లు "అతిస్నేహ: పాపశంకీ" అనునట్లు ప్రేమాతిశయముచే సర్వేశ్వరునకు ప్రాకృతుల వలన ఏమిచేటగునోయని భయపడి వారికి పల్లాండు పాడిరి. (మంగళా శాసనం చేసిరి) ఆకారణమున వీరిని పెరియాళ్వార్లు అని అందురు.

వీరికి శ్రీకృష్ణావతారమున ప్రావణ్యమధికవణజ్గుమ్‌. వీరనుగ్రహించిన

                       193