ఈ పుట ఆమోదించబడ్డది

3. పేయాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-
   తులా శతభిషగ్ఱాతం మయూర పురి కైరవాత్
   మహాస్తం మహదాఖ్యాతం వన్దే శ్రీ నన్దకాంశజమ్‌||
నిత్య తనియన్:-
   దృష్టాని తుష్టావ యో విష్ణుం రమయా మయిలాధినమ్‌
   కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయ మాశ్రయే||

వీరు ముదలాళ్వార్ల ముగ్గురిలో మూడవవారు. మదరాసులోని మయూరపురి(మైలాపూర్) యందు మణికైరవమనెడి భావియందవతరించిరి. వీరు మహాయోగులై లోకరీతిని వ్యవహరింపక సదా సర్వేశ్వరునే ధ్యానించుచు ఉన్మత్తుల వలె నుండుటచే పేయాళ్వార్ అని ప్రసిద్ధులైరి. వీరు ద్వాపరయుగాది 8,60,900 సంవత్సరమున సిద్దార్థినామ సంవత్సరమున తులా మాసం శుద్ద దశమీ గురువారం శతబిషానక్షత్రము నందవతరించిరి. మిగిలిన చరిత్ర పొయిగైయాళ్వార్ చరిత్రలో చూడవలెను.వీరునందకాంశజులు.

ఆళ్వార్లు:- పూదత్తాళ్వార్.
తిరునక్షత్రం:- తుల-శతబిషమ్‌.
అవతారస్థలం:- మయూరపురి.
ఆచార్యులు:- సేనముదలియాళ్వార్.
తిరువారాదన:-ఆళ్వార్కళ్‌నైనార్
ప్రబంధము:-మూన్ఱాం తిరువన్దాది. 100 పా.
మంగళాశాసన దివ్యదేశములు:- 15.

నాళ్‌పాట్టు

   ఐప్పిశియిల్ ఓణం ; అవిట్టం శదయమివై;
   ఓప్పిలవానాళ్‌గళ్;ఉలగత్తీర్-ఎప్పువియుమ్‌
   పేశుపుగழ் ప్పొయిగైయార్ పూదత్తార్;పేయాళ్వార్;
   తేశుడనే; తోన్ఱు శిరప్పాల్.

వాழிతిరునామజ్గళ్

   తిరుక్కణ్డే నెననూఱుమ్‌ శెప్పినాన్ వాழிయే
        శిఱన్ద ఐప్పిశియిల్ శదయమ్‌ శెనిత్త వళ్ళల్ వాழிయే
   మరుక్కమழுమ్‌ మయిలై నగర్ వాழవన్దోన్ వాழிయే
        మలక్కరియ నెయ్‌దన్ తనిల్ వన్దుదిత్తాన్ వాழிయే
   నెరుక్కిడవే యిడై కழிయిల్ నిన్ఱ శెల్వన్ వాழிయే
        నేమి శజ్గం వడివழగై నె--ల్వైప్పోన్ వాழிయే
   పెరుక్కముడన్ తిరుమழிశై ప్పిరాన్ తొழுవోన్ వాழிయే
        పేయాళ్వార్ తాళిణై యెప్పెరు నిలత్తిల్ వాழிయే

                                           184