ఈ పుట ఆమోదించబడ్డది

అష్టభుజస్వామి సన్నిధి కలదు. సన్నిధి ప్రాచీనమైనది. స్వామి అష్టభుజములతో వేంచేసియున్న కారణమున అష్టభుజస్వామియని పేరువచ్చెను. కాంచీపురములోని అష్టభుజస్వామి తరువాత ఆరీతిలో వేంచేసియున్న దివ్యస్థలము. ఇది సుప్రసిద్ధ వ్యాపారకేంద్రము. ఇచట ప్రతి వత్సరము ఉభయవేదాన్త సభలు జరుగు చున్నవి. దీనికి 10 కి.మీ అభినవభూతపురి(నరసాపురము)కలదు.

మార్గము: భీమవరం-నరసాపురం రైల్వే మార్గంలో పాలకొల్లు స్టేషన్.

కొఠాలపఱ్ఱు - 56

ఆదికేశవ ప్పెరుమాళ్-యతిరాజవల్లి త్తాయార్-అనంత విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ.

విశే: ఇదియు ప్రాచీనమైన సన్నిధి-సన్నిధిలో నరసాపురం సన్నిధిలోవలె కైంకర్యములు జరుగును. ఇచట శ్రీవైష్ణవ గోష్ఠి అతిశయముగా కలదు. స్వామి వరప్రదుడు.

మార్గము: పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండనుండి 5 కి.మీ.

రాజమహేంద్రవరము - 57

ఇది అతిప్రాచీనమైన నగరము. ఆదికవినన్నయ మహాభారతము నాంధ్రీకరించిన ప్రదేశము. గోదావరీనదీ తరంగాలతో సుశీతలమైన నగరము. గురుడు సింహరాశిలో ప్రవేశించునపుడు జరుగు పుష్కర సంరంభములు జగద్విఖ్యాతములు. ఇచట గోదావరీ స్నానము విశేషము. గోదావరి సమీపముననే ప్రాచీనమైన వేణుగోపాలస్వామి దేవాలయము కలదు. నగరములోని తులసీ రామానుజకూటము భక్తులకు వాసయోగ్యము.

మార్గము: విజయవాడ-విశాఖ రైలుమార్గములో రాజమండ్రి స్టేషన్. అన్ని ప్రధాన నగరముల నుండి బస్సు వసతి కలదు.

కోరుకొండ - 58

ఇచటకొండమీద ప్రాచీనమైన నరసింహస్వామి సన్నిధి గలదు. శ్రీరంగం పరాశర సుదర్శన్ భట్టర్ వంశీకులైన భట్టర్‌స్వామివారి నిర్వాహములోగల క్షేత్రము. స్వామి వరప్రదుడు-ప్రతి సంవత్సరము ఉభయ వేదాంత సభలు వైభవముగా జరుగుచుండును.

మార్గము: రాజమహేంద్రవరమునకు 20 కి.మీ.

176