ఈ పుట ఆమోదించబడ్డది

వారణాసి (కాశీ) - 32

మోక్షప్రద నగరము లేడింటిలో కాశియొకటి. ఇచటవేంచేసియున్న బిందుమాధవ స్వామి మోక్షప్రదాత. ఇచట శ్రీకేశవస్వామి ఆలయము ప్రాచీనమైనది. లక్ష్మీదేవి తాయార్-నిలచున్నసేవ-తూర్పుముఖము-చక్రతీర్థము-గంగానది-అవిముక్తవిమానము-పరమశివునకు ప్రత్యక్షము. ఇది ప్రసిద్ధ శివక్షేత్రము. అయినను విష్ణుమహిమలకు కొదువలేదు. ఈక్షేత్రమున చనిపోయినవారి చెవిలో పరమశివుడు రామతారక మంత్రమునుపదేశించునట. ఆమంత్ర ప్రభావము వలన మోక్షము లభించును. కావుననే ఇచట శవవాహకులు "రామనామ్‌సత్యహై" అని ఎలుగెత్తి చాటుతారు. ఇచటి గంగావది ప్రతిభారతీయులకు తప్పక సేవింపదగినది. "కజ్గై కజ్గై యెన్ఱు" గంగ గంగ అనుటతోడనే మన కల్మషములన్నియు తొలగిపోవును.

మార్గము: ప్రధాన నగరముల నుండి రైలు వసతి కలదు.

పుష్కరక్షేత్రము - 33

పరమ పురుషన్-పుండరీక వల్లి తాయార్-మంగళవిమానము-పద్మసరస్సు-నిలచున్నసేవ-తూర్పుముఖము-నృసింహ ఘట్టం-చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యక్షము.

ఇది అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో నొకటి. స్వామి నైమిశారణ్యములో వనరూపిగా నున్న విధమున, ఇచట తీర్థరూపముగా నున్నాడు. ఇచట తీర్థమాడుటయే (స్నానము చేయుట) ప్రధానము. ఇచట లక్ష్మీనరసింహస్వామి సన్నిధియు కలదు. ఉ.వే.శ్రీమాన్ ప్రతివాది భయంకరం ఆద్య అనంతాచార్యస్వామి వారి రంగాజీ మందిరం వసతికి అనుకూలము.

మార్గము: ఈ క్షేత్రము అజ్మీర్‌కు 10 కి.మీ. దూరమున గలదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనిది.

గోవర్థనము - 34

గోకులనాథుడు-శ్రీహరినాథన్-రాదాదేవి-పర్వతవిమానము-మానసగంగ-బ్రహ్మతీర్థము-బ్రహ్మతీర్థము-రాధాతీర్థము-కాళిందిమడుగు-నిలచున్నసేవ-తూర్పుముఖము-బ్రహ్మకు, కాళీయునకు ప్రత్యక్షము. ఈగోవర్థన పర్వతమునే శ్రీకృష్ణుడు చిటికెన వ్రేలితో పైకి ఎత్తెను.

మార్గము: ఈక్షేత్రము బృందావనమునకు సమీపమున గలదు.

164