ఈ పుట ఆమోదించబడ్డది

గయాక్షేత్రము - 31

ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము-ఇచట వేంచేసియున్న స్వామిపేరు గదాధరుడు-వైకుంఠ విమానము-నిలచున్నసేవ-ఉత్తరముఖము-పల్గునీనది-గయాసురునకు ప్రత్యక్షము-విష్ణుపాదము-స్థలవృక్షము అక్షయ వటము.

ఇటగల శ్రీవిష్ణుపాదము; అక్షయవటము ప్రతిభారతీయునకు తప్పక సేవింపదగినవి.

శ్లో. జీవతో ద్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్
   గయాయాల పిండదావచ్చ త్రిభి: పుత్రస్యపుత్రతా||

అనిచెప్పినట్లు పుత్రకృత్యములలో గయా శ్రాద్ధమొకటి. ఈ గయా శ్రాద్ధమును అవశ్య కర్తవ్యంగా ధర్మశాస్త్రం బోదించింది. అంతేకాక మనగృహాదులలో శ్రాద్ధక్రియలు నిర్వహించేటప్పుడు ఈ గయా క్షేత్రాన్ని, ఇచటి అక్షయవటాన్ని స్మరించడం సంప్రదాయం. ఇట్టి ఈక్షేత్రాన్ని ప్రతిభారతీయుడు తప్పక సేవించాలి. దీనికి 10 కి.మీ.దూరములో చంపకరాణ్యం కలదు.

మార్గం: కాశీనుండి 320 కి.మీ. గయా రైల్వే స్టేషన్.


163