ఈ పుట ఆమోదించబడ్డది

పచైప్పెరుమాళ్ కోయిల్ (పేట్టై) - 6

పచ్చైవణ్ణ పెరుమాళ్-హారీతవారణ పెరుమాళ్-అమృతవల్లి త్తాయార్-దాశరథి అనే ముదలియాండాన్ అవతారస్థలము. వీరు భగవద్రామానుజులకు భాగివేయులు మరియు పాదుకాస్థానీయులు. మార్గము: మద్రాసు-కాంచీపురము మార్గంలో పూన్దమల్లికి సమీపమున గలదు.

కూరమ్‌ - 7

స్వామి యెంబెరుమానార్ల శ్రీపాదములాశ్రయించిన వారిలో ప్రథానులగు కూరత్తాళ్వాన్ అవతరించిన దివ్యదేశము.

పూన్దమల్లి (పూనమల్లి) - 8

వరదరాజప్పెరుమాళ్-పెరుందేవిత్తాయార్-శ్రీనివాస పెరుమాళ్-పుష్పకవల్లి త్తాయార్-తిరుక్కచ్చినంబిగారి అవతారస్థలం. మార్గము: మద్రాసులోని ఆవడికి 10 కి.మీ. ఇచట నుండిపోయి పచ్చైపెరుమాళ్ కోయిల్ సేవించవచ్చును.

మధుర మంగలమ్‌ - 9

ఆదికేశవప్పెరుమాళ్ సన్నిధి. గోవిందభట్టర్ అనే ఎంబార్ అవతార స్థలము. వీరు భగవద్రామానుజులకు పినతల్లి కుమారులు. భగవద్రామానుజుల తర్వాత వీరు దర్శన స్థాపకులుగా వేంచేసియుండిరి. మార్గము: శ్రీ పెరుంబుదూరు-కాంచీపురము మార్గములో సుంకువారి చావడికి 12 కి.మీ.

మయూరపురి (మైలాపూర్) - 10

ఇది మద్రాసులోని ఒక భాగము. మైలాపూర్ అని వ్యవహరింపబడు చున్నది. ఆదికేశవప్పెరుమాళ్-మాధవప్పెరుమాళ్ సన్నిధులు కలవు. కైరవిణిపుష్కరిణి-ముదలాళ్వార్లలో చివరివారైన పేయాళ్వార్లు అవతరించిన స్థలము. వీరు ఈసన్నిథిలోని మణికై రవమనెడి బావియందు అవతరించిరి. కేశవప్పెరుమాళ్ సన్నిధిలో సుదర్శనాళ్వార్ సన్నిథి కలదు. వీరు మిక్కిలి ప్రభావసంపన్నులు. ఈ సన్నిధి సమీపమునందే శ్రీనివాస పెరుమాళ్ సన్నిథి కలదు. ఇచట హయగ్రీవర్, నరసింహస్వామి వేంచేసియున్నారు. పెరుమాళ్లు సౌందర్యాతి శయముతో వేంచేసియుందురు.

                                         153