ఈ పుట ఆమోదించబడ్డది

అభిమాన దివ్య స్థలములు

మధురాన్తకమ్‌ - 1

కరుణాకరప్పెరుమాళ్(ఏరికాత్తరామన్)-జనకజవల్లి త్తాయార్-తూర్పు ముఖము-నిలచున్నసేవ-పెరియనంబిగారు(మహాపూర్ణులు) భగవద్రామానుజులకు పంచ సంస్కారములు గావించిన ప్రదేశము. విశే: ఈ ఊరిలోని పెద్దచెఱువు పొంగివచ్చుచుండగా స్వామి రామలక్ష్మణులుగా కావలి కాయుటచే స్వామికి ఏరికాత్తరామన్ అనిపేరు వచ్చెను. మార్గము: మద్రాసు విళ్లుపురమ్‌ బస్, రైలు మార్గం చెంగల్పట్టు నుండి విళ్లుపురం మార్గంలో సుమారు 25 కి.మీ.

కురుగైక్కవలప్పన్ సన్నిధి - 2

శ్రీమన్నాథమునుల శిష్యులగు కురుగై క్కావలప్పన్ అవతరించిన స్థలము. వీరు యోగనిష్ఠులగుటచే యోగ దశలో పెరుమాళ్లను సేవించెడివారు. నాథమునుల నుండి యోగరహస్యములను గ్రహించిరి. వానిని యామునమునులకు ఉపదేశింప నియమనము పొందిరి. కానీ కారణాంతరముల వలన యామునులు ఆ రహస్యములును పొందలేకపోయిరి. మార్గము: శ్రీముష్ణమునకు 12 కి.మీ.

గుణశీలమ్‌ - 3

శ్రీనివాస పెరుమాళ్-పద్మావతీ దేవిత్తాయార్-నిలచున్నసేవ-తూర్పుముఖము-ఈస్వామి వరప్రసాది. తిరుమలలో వలెనే ఇచటను జనసందోహము మెండుగా కలదు. మార్గము: శ్రీరంగము నుండి పోయి సేవింపవచ్చును. 25 కి.మీ.

మణ్ణంగుడి - 4

ఇది తొండరడిప్పొడి యాళ్వార్ల అవతార స్థలము. కుంభకోణము నుండి పోయి సేవింపవచ్చును.

వడువూర్ - 5

కోదండరామస్వామి-జనకజవల్లి తాయార్-నిన్నతిరుక్కోలము-తూర్పుముఖము-ఇచటస్వామి "పుంసాంమోహనరూపాయ" అనునట్లు వేంచేసి యుందురు. మార్గము: రాజమన్నార్ గుడి నుండి 10 కి.మీ.

                                                    152