ఈ పుట ఆమోదించబడ్డది

3. పాప వినాశనమ్‌

శ్లో. శ్రీ మత్పాప వినాశ నామని పురే శ్రీ పుండరీ కాఖ్య స
   త్తీర్థే పాప వినాశ మధ్య నిలయ: ప్రాచీముఖ స్సంస్థిత:|
   ప్రత్యక్షో జయ చోళనామ సృపతే శ్శ్రీ పాపనాశ ప్రభు
   ర్దేవ్యా పంకజ వల్లికాహ్వయ యుజా సంశోభితే సంతత:||

విశే: పాపవినాశ పెరుమాళ్; పంకజవల్లి తాయార్; పాపవినాశ విమానము; పుండరీక పుష్కరిణి; తూర్పుముఖ మండలము; నిలచున్నసేవ; జయచోళునకు ప్రత్యక్షము.

మార్గము: ఈ క్షేత్రము తంజావూరునకు 24 కి.మీ. దూరమున గలదు. సమస్త సౌకర్యములు గలవు. కుంభకోణము నుండి టౌన్‌బస్ కలదు. ఈ క్షేత్రమునకు 3 కి.మీ. దూరమున కపిస్థలమను దివ్యదేశము కలదు.


మంచిమాట

భగవంతునకు భక్తునకు మధ్య భేదము చూపరాదు. భాగవతోత్తముల యందు భగవదనుగ్రహము కలదని భావింపవలెను. భగవంతుని శ్రీపాదములను ఆశ్రయించినట్లుగనే భక్తులను కూడా ఆశ్రయింపవలెను. వారివద్ద తీర్థ స్వీకారము చేయునపుడు తమ ఆచార్యులను స్మరింపవలెను. తాను ఇతరులకు తీర్థమును ప్రసాదించునపుడు తమ ఆచార్యుని స్మరించుచు ద్వయమంత్రాను సంధానము చేయవలెను. ఇట్లుచేయుట తీర్థమిచ్చువారికిని తీసుకొనువారికిని స్వరూపానురూపమై యుండును. ఈ విధముగా కాక అర్ధ కామ పరవశులైనచో స్వరూపహాని సంభవించును.

"యామునమునులు"

                                            145