ఈ పుట ఆమోదించబడ్డది

2. శ్రీ ముష్ణమ్‌

శ్లో. శ్రీ ముష్ణే పురి నిత్యపుష్కరిణికా సంశోభితే వామనం
   వైమానం సమధిశ్రితోంబు జలతా వాధోంబు రాద్ది జ్ముఖ:|
   శ్రీమాసాది వరాహనామ విదితో హ్యశ్వత్థనారాయణ:
   ప్రత్యక్షో భువి రాజతే నవరతం సత్సజ్గ కల్పద్రుమ:||

వివ: ఆది వరాహపెరుమాళ్-అంబుజవల్లి నాచ్చియార్; వామన(వేద)విమానము; నిత్యపుష్కరిణి; తూర్పు తిరుముఖ మండము; నిలచున్నసేవ; అశ్వత్థ నారాయణునకు ప్రత్యక్షము.

ఇది అష్టస్వయంవ్యక్త క్షేత్రములలో నొకటి. ఉత్సవరులకు యజ్ఞ వరాహన్ అనిపేరు. హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని యుద్ధరించి అర్చామూర్తిగా అవతరించుటచే ఆదివరాహమనిపేరు. ఇచట తాయార్లకు చెలికత్తెలుగా నలుగురు కన్యలుగలరు.

కమఠన్, ఠుల్లికా; సుద్యుమ్న; భూదేవి, సుధర్ములకు ప్రత్యక్షము.

మార్గము:- చిదంబరం నుండి 25 కి.మీ. వృద్ధాచలం నుండి కూడ బస్ వసతి కలదు.

భూ వరాహస్వామి

BHOORAHA SWAMY