ఈ పుట ఆమోదించబడ్డది

97. శింగవేళ్ కున్ఱమ్‌ (అహోబిలం) 2

శ్ల్లో. తీర్థై రింద్ర సుపావనాశ నరసింహాఖ్యానకై రంచితే
   లక్ష్మీం ప్రాస్య గుహం విమాన ముపయన్ శ్రీ నారసింహో హరి:|
   దివ్యేహోబిల పట్టణే విజయతే ప్రాచీ దిశాస్యాననో
   ప్రహ్లాదాక్షి పదం గత: కలిరిపు శ్శ్రీమచ్చఠారి స్తుత:||

వివ: శ్రీ నరసింహస్వామి-లక్ష్మీదేవి-ఇంద్ర-పాపనాశ-నరసింహ తీర్థములు-గుహ విమానము-తూర్పుముఖము-కూర్చున్నసేవ-ప్రహ్లాదునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు.

లక్ష్మీనరసింహం-దిగువ అహోబిలం
సత్తిరాంత నరసింహం,
యోగనరసింహం:- తేరువీథిలో 2 కి.మీ. దూరమున
కారంగి నరసింహం:- పై అహోబిలం
ఉగ్రనరసింహం:- దిగువ అహోబిలం
భార్గవ నరసింహం:- గరుడాద్రి
పర్ములిధి నరసింహం:- వేదాద్రి
వరాహ నరసింహం:-
ప్రహ్లాద నరసింహం:- గంధాద్రి
అహోబిల పర్వతము చుట్టును అనేక సన్నిధులు తీర్థములు కలవు.

మార్గము: శెన్నై-బొంబాయి రైల్వేమార్గములో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని "ఎర్లకట్ట" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం కలదు. అన్నివసతులు కలవు.

పా. అజ్గణ్ -ఇల- అజ్గోరాళరియాయ్, అవుణన్
   పొజ్గవాగమ్‌ వళ్ళుగిరాల్; పోழ்న్ద పునిద నిడమ్;
   పైజ్గాణనై క్కొమ్బుకొణ్డు; పత్తిమైయాల్; అడిక్కిழ்చ్
   చెజ్గణాళియిట్టిఱై -మ్‌ శిజ్గవేழ்; కున్ఱమే.
         తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-7-1

                                            131