ఈ పుట ఆమోదించబడ్డది

సమయమున ఇచట స్వామి తిరుమంజనమునకై కిరీటాద్యాభరణములను తొలగించుకొని యుండి సహజ రూపంతోనే ఆ భక్తునకు దర్శనమిచ్చి పరమపదం అనుగ్రహించినాడట. ఈవృత్తాన్తాన్ని వినిన భగవద్రామానుజులు ఆగ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదుల లేక సహజరూపంలో ఉండు శ్రీవేజ్కటాచలపతిని, ఆప్రక్కనే "కురువైనంబి" విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఈకురువై నంబి స్వామికి అంతరంగికులు.

శ్రీఆళవన్దారుల ఆజ్ఞానుసారం పెరియతిరుమలనంబిగారు భగవద్రామానుజులకు తిరుమల అడివారంలో శ్రీమద్రామాయణ కాలక్షేపం సాయించేవారట. ప్రతినిత్యం తిరుమలలో తీర్థ కైంకర్యాదికం పూర్తిచేసికొని కొండదిగివచ్చి కాలక్షేపం సాయించు చుండుట చేత మాధ్యాహ్నిక సేవ లభించుట లేదే అనివారు ఒక రోజు చింతించుచుండగా స్వామి ఆరాత్రి వారికి స్వప్నంలో ఇదిగో మీకు సేవ సాయించుచున్నాము చూడండి అనిపలికినారట. మరునాడు తీర్థ కైంకర్యం పూర్తి చేసికొని అడివారమునకు రాగానే అక్కడ ఒక చింతచెట్టు క్రింద ఒక బండమీద స్వామి పాదములు దర్శనమిచ్చినవి. శ్రీరామానుజులు తమ ఆచార్యులద్వారా ఆ అద్బుత వృత్తాన్తాన్ని విని అచట ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడ అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలాగున ఆదేశించారట. అందే శ్రీమద్రామాయణ కాలక్షేపం పూర్తిగావించినారు.

మణవాళమామునుల సన్నిధి సేవాక్రమము

శ్రీమతి మహతిద్వారే చి-- కా--స మయం చ బలిపీఠమ్‌
స్థాన మథ యామునేయం చన్పుకతరు సమ్పదం ప్రతీహారమ్‌
వినతా తనయ మహానస మణి మణ్డపం కనక మయ విమానపరమ్‌
పృతనాపతి యతిధుర్యౌ నరహరి మథ సమత జానకీ జానిమ్‌||
అథపునరసఘ మణిద్యుతి కవచిత కమలా నివాసభుజ మధ్యమ్‌|
కలయత కమల విలోచన మంజనగిరి నిధి మనంజనం పురుషమ్‌||

సంపత్కరమైన గోపుర ద్వారమును;అత్తాళిప్పుళిని(చింతచెట్టు) బంగారు బలిపీఠము; యమునై త్తుఱైవర్ అనుపుష్పమండపమును; సంపంగి చెట్లతో నిండిన ప్రాకారమును,గరుడాళ్వార్లను; తిరుమడప్పళ్లిని(వంటశాల) తిరుమామణి మండపమును; స్వర్ణమయమైన ఆనందనిలయ విమానమును; సేనమొదలియాళ్వార్లను; యెంబెరుమానార్లను; నరసింహస్వామిని శ్రీరామచంద్రులను సేవించిరి. అటపిమ్మట ధరించిన మణికాంతులచే ప్రకాశితమైన లక్ష్మీదేవికి నిత్యనివాసమైన వక్షస్థలము గలవాడను, అంజనాద్రికి నిధి వంటివాడును; అఖిలహేయ ప్రత్యనీకుడును; పరమపురుషుడునగు శ్రీనివాసుని కనులార సేవించిరి.

                                            124