ఈ పుట ఆమోదించబడ్డది

95. తిరుక్కడిగై (చోళసింహపురము) 22

శ్లో. చోళ సింహ పురే యోగ సింహనామా విరాజతే|
   అమృతాహ్వయ తీర్థాడ్యే సింహకోష్ట విమానగ:||
   దేవీమమృత వల్లాఖ్యా మాశ్రిత: ప్రాజ్ముఖాసన:|
   ప్రత్యక్షో మారుతై శార్జ్గ నందకాంశ మునిస్తుత:||

వివ: యోగ నరసింహ స్వామి(అక్కారక్కన్)-అమృతవల్లి త్తాయార్-అమృత తీర్థము-సింహకోష్ట విమానము-తూర్పుముఖము-కూర్చున్నసేవ-ఆంజనేయస్వామికి ప్రత్యక్షము-కలియన్; పేయాళ్వార్ కీర్తించినది.

విశే: చోళ సింహపురమునకు(చోళంగిపురము) 3 కి.మీ. దూరములో కొండపాలెము కలదు. ఇచట పెద్దకొండపై నృసింహస్వామి, అమృతవల్లితాయార్ల సన్నిధి కలదు. ప్రతి శుక్రవారము స్వామికి విశేషముగా తిరుమంజనము జరుగును. చిన్నకొండపై ఆంజనేయస్వామి వేంచేసియున్నారు. ఇచట ఆంజనేయస్వామివారు చతుర్బుజములతో శంఖ చక్రములతో యోగ ముద్రతో వేంచేసి యుండుట విశేషము. ఈక్షేత్రము విశేషప్రార్థనా స్థలము. దీర్ఘవ్యాదులు కలవారు, గ్రహపీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు చేతురు. చోళసింహపురములో భక్తవత్సలన్ (ఉత్సవమూర్తి) వేంచేసియున్నారు. వీరి సన్నిధి వెనుక ఆదికేశవర్ వేంచేసి యున్నారు. ఎఱుంచి అప్పా అవతార స్థలము అగు ఎరుంబి అగ్రహారము ఈ క్షేత్రమునకు సమీపముననే కలదు. మణవాళ మహామునులు ఈ క్షేత్రమునకు వడ శ్రీరంగమనియు ఇచ్చటగల పుష్కరిణికి తిరుక్కావేరి అనియు తిరునామముంచిరి.

మార్గము: తిరుత్తణి/ అరక్కోణంకు 30 కి.మీ.

పా. మిక్కానై మఱై యాయ్ విరిన్ద విళక్కై; ఎన్నుళ్
   పుక్కానై ప్పుగழ்శేర్ పొలిగిన్ఱ పొన్ మలై యై
   తక్కానై క్కడిగై త్తడజ్కున్ఱిన్ మిశై యిరున్ద;
   అక్కారక్కనియై; అడైన్దుయ్‌న్దు పోనేనే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 8-9-4

ఉత్తరదేశ తిరుపతులు

శ్లో. ఇదానీ ముత్తరే దేశే స్థితా దేశా: రమాపతే:|
   పర్ణ్యంతే యతిరాజాంఘ్రి ప్రభావాత్సన్ముదే మయా||

శ్రీభగవత్ రామానుజుల వారి శ్రీపాద ప్రభావముచే ఇకపై ఉత్తరదేశమున గల దివ్యదేశములను వర్ణింతును.

                                            115