ఈ పుట ఆమోదించబడ్డది

          శిన్దై యుళ్ళై ముళై తైழన్ద తీజ్గరుమ్బినై;
   ప్పోరానై కొమ్బొ శిత్త పోరేత్ తినై;
          పుణర్ మరుద మిఱనడన్ద పొఱ్కున్ఱినై;
   క్కారానై యిడర్ కడిన్ద కఱ్పగత్తై
          క్కణ్డదునాన్ కడన్మల్లై త్తలశయనత్తే.
          తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-5-1

94. తిరువల్లిక్కేణి (చెన్నై) 21

శ్లో. శ్రీ మత్కై రవిణీ సరోవర లసత్ బృందావనాఖ్యాయుతే
   వల్లిక్కేణి పురే స్థిత స్సుర దిశా పక్త్రాంబుజో రాజతే|
   రుక్మిణ్యా త్వవిరుద్ద సాత్య బల ప్రద్యుమ్న సేవ్యో త్రిణా
   సంపూజ్యో భువి పార్దసారధి విభు: పార్దాక్షి యుగ్మా తిధి:||
   
   తత్తైవ రంగనాథఖ్యో వేదవల్ల్యా ఫణీంద్రగ:|
   భృగుణా కన్యకాదానం ప్రాపిత స్సుర దిజ్ముఖ||
   తత్తైవ నరసింహాఖ్య: పశ్చిమాభిముఖానస:
   జాబాల్యత్రి మునీంద్రాభ్యాం సేవితో మోక్షదస్తయో::||

   సీతాలక్ష్మణ శత్రుఘ్న భరతై స్తత్ర రాఘవ:
   దక్షిణాభి ముఖస్తిష్ఠన్ మధుముమ్మవి వీక్షిత:||
   గజేంద్ర వరద స్తత్ర సప్తరోమ మునీక్షిత:|
   ప్రాజ్ముఖో గరుడా రూడ శ్శేషాహ్వయ విమానగ:||

   ఇంద్రాగ్ని సోమ మీనాఖ్య విష్ణు తీర్థాతి సుందరే
   శ్రీ మత్కైరవిణీ తీరే రాజంతే పంచమూర్తయ:||
   మార్కండేయాత్రి సుమతి మరీచి భృగు యోగిన:|
   జాబాలి సర్ప రోమణౌ తేపురత్ర పరం తప:||

   పరకాల మహాయోగి భక్తిసార పరిస్తుత:|
   తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే ||

వివ: బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. కైరవీణీ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఆనన్దవిమానము-అత్రిమహామునికి తిరువారాధనము-అర్జునునకు ప్రత్యక్షము.

అచటనే మన్నాధర్.(ఎన్నెయాళుడై యప్పన్;రంగనాథులు) వేదవల్లిత్తాయార్-తూర్పుముఖము-భుజంగశయనము-భృగుమహర్షిచే కన్యాదానము

                                             113