ఈ పుట ఆమోదించబడ్డది

ఈస్తోత్ర ప్రచురణకై నాకంటె మిన్నగా శ్రమపడి పదాన్యులను కలసికొని వారి ద్వారా ఆర్థిక సహాయములను చేకూర్చిన సోదరద్వయము ఉ.వే.శ్రీమాన్ వేదాల వేణుగోపాలచార్యులు. ఉ.వే.శ్రీమాన్ వేదాల శ్రీరామాచార్యులగార్లకు మాకృతజ్ఞతల నర్పించుకొనుచున్నాము.

తొలుతగా నీగ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయము నందించిన పరమ భాగవత శిఖామణులు శ్రీమాన్ గునుపాటి చెల్వపిళ్లైగార్కి, శ్రీమాన్ డా|| వేదాల రంగనాద్ గార్కి మాకృతజ్ఞతా పూర్వకమంగళాశాసనములు.

తమకు అపరచితమైన భాష - తమ ప్రాంతముకాదు. అయినను భగవత్కైంకర్యమునకునివి ప్రతి బంధకములు కావని భావించి ఈగ్రంథముద్రణకు అవసరమైన కాగితపు వెలను కైంకర్యముగా సమర్పించిన మహనీయులు శ్రీమాన్ ఉపేంద్రషా-బొంబాయివారు వారి ఔదార్యమునకు కృతజ్ఞతా పూర్వక మంగళాశాసనముల నర్పించుచున్నాము.

ఈస్తోత్ర ఆంధ్ర వివరణలో నాకు సహకరించిన నా సోదరుడు శ్రీమాన్ చి.నడాదూరు గోవిందరాజన్, యం.ఎ.యమ్‌.ఫిల్‌కు; ఉ.వే.శ్రీమాన్ వంగల వేంకటాచార్యులు, బి.ఎ.బి.యల్‌.కు అనేక మంగళాశాసనములు.

శుద్దప్రతిని తయారుచేయుటలోను, తమిళలిపిలోని గ్రంథములను చదివి వినిపించుటలోను, ప్రూపురీడింగులోను సహకరించిన నాశ్రీమతి హేమాబ్జవల్లి, యమ్‌.ఎ.(తెలుగు)యమ్‌.ఎ.సంస్కృతంకు అనేక ఆశీస్సులు.

ఇక ముద్రణ విషయమున నాకు సహకరించిన శిష్యుడు శ్రీమాన్ చి||భాస్కరాచార్యులకు అందముగా D.T.P.చేసిన శ్రీ సత్తి జగదీష్ రెడ్డి, సూరిభట్ల నాగేశ్వరరావులకు అనేక ఆశీస్సులు. దీనిని అందముగా ముద్రించుటలో సహకరించిన శ్రీ సత్యా ఆఫ్‌సెట్‌, తాడేపల్లిగూడెం వారికి మా కృతజ్ఞతలు.

ఆదినుండి అంత్యమువరకు దీనిని పర్యవేక్షించి ఇంత సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దిన మా అన్నగారు ఉ.వే.శ్రీమాన్ కె.ఎస్‌.రామానుజాచార్యుల వారి సన్నిధిలో సహస్ర ప్రణామములర్పించు చున్నాడను.

భాగవతవిధేయుడు

రామానుజాచార్యులు