ఈ పుట ఆమోదించబడ్డది

90. తిరువెవ్వుళ్ళూరు 17

(తిరువళ్ళూరు)

శ్లో. శ్రీ హృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే
   వీక్షారణ్య మితి ప్రసిద్ధి విభవే శ్రీ శాలిహోత్రేక్షిత:|
   ప్రాగాస్యో వర వీరరాఘవ విభు స్సౌవర్ణవల్లీ పతి:
   భోగేన్ద్రే జయకోటి మందిరగత: శేతే కలిఘ్నస్తుత:||

వివ: వీరరాఘవపెరుమాళ్-కనకవల్లితాయార్-హృత్తాప నాశతీర్థం వీక్షారణ్యం-తూర్పు ముఖము-భుజంగశయనము-విజయకోటి విమానము-శాలి హోత్రులకు ప్రత్యక్షము-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము? అని అడిగిరట. కావుననే ఈ క్షేత్రమునకు "తిరు ఎవ్వుళ్‌వూర్" (కింగృహ)క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు. మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. మకర మాసం పూర్వాభాద్ర అవసానముగా పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వత్తురు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహములో నున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వీధిలో అహోబిల మఠము కలదు. సమస్త వసతులు కలవు.

మార్గము: శెన్నై-అరక్కోణం రైలు మార్గములో తిరువళ్లూరు స్టేషన్ నుండి 5 కి.మీ. మద్రాసు నుండి అన్ని ప్రధాన పట్టణముల నుండి బస్ సౌకర్యము కలదు. ఆంధ్రాలో సూళ్లూరుపేట నుండి, తిరుపతి నుండి బస్ సౌకర్యము కలదు.

పా. వన్దిరుక్కుమ్‌ మెల్ విరలాళ్; పావై పనిమలరాళ్,
   వన్దిరుక్కుమ్మార్; వన్ నీలమేని మణివణ్ణన్;
   అన్దరత్తిల్ వాழுమ్‌ వానోర్; నాయగనాయమైన్ద;
   ఇన్దిరఱ్కుమ్‌ తమ్బెరుమా; నెవ్వుళ్ కిడన్దానే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-2-9


మంచిమాట

ఆత్మకు అహంకారము ఆవరించి యుండుటచే నిజస్వరూపమును తెలియక మిట్టిపడును. ఆ అహంకారము తొలగినచో "దాసుడను" అని తన సహజ స్వరూపముతోనే వ్యవహరింపబడును.

"వడక్కుత్తిరువీధి ప్పిళ్లై"

                                                   109