ఈ పుట ఆమోదించబడ్డది

దివ్యదేశములను వివరించునపుడు ఆయాప్రబంధముల వ్యాఖ్యానములలోని విశేషాంశాదులను, ఆళ్వార్ల ఆచార్యుల అనుభవములను యథావకాశము వివరించితిమి మధ్యమధ్య పూర్వాచార్యుల శ్రీసూక్తులను సంప్రదాయరహస్యములను "మంచిమాట" అను శీర్షిక ద్వారా అందించితిమి.

మాయీప్రయత్నమును విన్నవింపగా సఫలమగునట్లు మంగళాశాసనమనుగ్రహించినవారు శ్రీమత్పరమహంసపరివ్రాదికాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణరామానుజజీయర్ స్వామివారు. వారి మంగళా శాసనముతోపాటు పదివేలరూపాయల ఆర్ధిక సహాయమును కూడ అందించిన పరమోదారులు. వారి మంగళాశాసన బలమే ఈ కార్యమునకు శ్రీరామరక్ష. వారి శ్రీపాదములందు సహస్రప్రణామములర్పించుచున్నాడను.

మా ప్రయత్నమును ఆదరించి ఆర్ధిక సహాయము నందించిన తిరుమల తిరుపతి దేవస్థానము వారికి మా కృతజ్ఞతాంజలి నర్పించు చున్నాము.

ఈస్తోత్రము విషయమై ఉ.వే.శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామివారిని సేవించినపుడు వారు మంగళాశాసనము కృపచేయుటయేగాక విశాఖభక్తుల సహకారము గూడ అందునట్లు సహకరించినారు. వారి సన్నిధిలో ప్రణామములర్పించుచున్నాము.

అట్లే తగిన సూచనలతోపాటు మార్గ నిర్దేశకులై మంగళాశాసనము ననుగ్రహించిన కవిశాబ్దిక కేసరి ఉ.వే.శ్రీమాన్ న.చ.రఘునాథాచార్య స్వామి వారి సన్నిధిలో ప్రణామముల నర్పించుచున్నాము.

ఈ స్తోత్రమునాదరించి మాకవసరమగు తమిళ అక్షరములను యిచ్చుటయేగాక మంగళాశాసనము ననుగ్రహించిన శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారి సన్నిధిలో సహస్ర ప్రణామములర్పించుచున్నాము.

ఇంకను ఈగ్రంథప్రచురణలో అపూర్వ సహకారము నందించిన మహానీయులు ఉ.వే.శ్రీమాన్ కె.కె. పరకాలన్‌స్వామివారి సన్నిధిలో ప్రణామపూర్వక కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాను. అటులనే తగిన సూచనలను సహకారమునందించి మంగళాశాసనముల ననుగ్రహించిన

ఉ.వే.శ్రీమాన్ కె.వి.ఆర్. నరసింహాచార్యులుగారు, విశాఖపట్నం.

ఉ.వే.శ్రీమాన్ యస్.బి.రఘునాథాచార్యులుగారు, వైస్ చాన్సలర్, తిరుపతి.

ఉ.వే.శ్రీమాన్ కె.వేంకటాచార్యులుగారు, నరసాపురం.

వారలకు ప్రణశ్శతములర్పించుకొనుచున్నాడను.