ఈ పుట ఆమోదించబడ్డది

86. పవళవణ్ణమ్‌ (కాంచీ) 13

శ్లో. శ్రీమత్పవళవాణ్ణఖ్యే పురేచక్ర సరోంచితే
   ప్రవాళవర్ణ భగవాన్ ప్రవాళాఖ్య విమానగ:|
   ప్రవాళవల్లీ నాయక్యా పశ్చిమాసన సంస్థిత:
   ఉమాశ్విదేవతా దృష్టో రాజతే కలిహస్తుత:||

వివ: పవళవణ్ణ పెరుమాళ్-ప్రవాళవల్లి త్తాయార్-ప్రవాళ విమానము-చక్రపుష్కరిణి-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-పార్వతీదేవికి అశ్వనీదేవతలకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

కామాక్షి ఆలయమునకు 1 కి.మీ దూరములో గలదు. ఈ సన్నిధి ఎదురు వీధిలో పచ్చవణ్ణర్ సన్నిధి కలదు.

పా. వజ్గత్తాళ్ మామణి వన్దున్దు మున్నీర్
          మల్లైయాయ్;మదిళ్ కచ్చి యూరాయ్ పేరాయ్,
   కొజ్గుత్తార్ వళజ్గొన్ఱె యలజ్గళ్ మార్వన్;
          కులవరై యన్ మడప్పానై యిడప్పాల్ కొణ్డాన్;
   పజ్గత్తాయ్ పాఱ్కడలాయ్ పారిన్ మేలాయ్;
          పనివరై యినుచ్చియాయ్ పవళవణ్ణా!,
   ఎజ్గుற்றா యెమ్బెరుమా నునైనాడి,
          యేழைయే ని-నమే యుழிతరుగేనే.
          తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్‌-9


మంచిమాట

శిష్య లక్షణము

సద్బుద్ధి సాధుసేవ సముచిత చరిత స్తత్వబోధాభిలాషే
శుశ్రూషు స్త్వక్తమాన: ప్రణిపతనేపర:ప్రశ్నకాల ప్రతీక్ష:
శాన్తో దాన్తోవ సూయు:శరణ ముపగత శ్శాస్త్ర విశ్వాన శాలీ
శిష్య:ప్రాప్త:పరీక్షాం కృత విదభిమత:తత్త్వత:శిక్షణీయ:||

మంచి విషయములందు ఆసక్తిగల బుద్ధి కలిగినవాడు, సాధుసేవాతత్పరుడు, సదనుష్ఠాన సంపన్నుడు, తత్త్వజ్ఞానమును పొందగోరువాడు, ఆచార్యశుశ్రూషాతత్పరుడు, దురభిమానమును విడచినవాడు, దండవత్ ప్రణామపరుడు, ప్రశ్నకాలమును నిరీక్షించువాడు, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము కలవాడు, అసూయలేనివాడు, శరాణాగతుడు, శాస్త్ర విషయములందు విశ్వాసము కలవాడు, నగు శిష్యుడులభించినచో వానిని స్వీకరించి తత్వవజ్ఞానమును ఉపదేశింపవలెను.

                                            105