ఈ పుట ఆమోదించబడ్డది

తిరువనంత పుష్కరిణిని; గోపికారమణుడైన శ్రీకృష్ణుని సన్నిధిని, వరాహ పెరుమాళ్లను, పెరియాళ్వార్లను, నమ్మాళ్వార్లను, తిరుమజ్గై యాళ్వార్లను, తిరుమழிశై ఆళ్వార్లను, పెరియనంబి(మహాపూర్ణులు) గారి సన్నిధిని, ఉడయవరులను, ముదలాళ్వార్లను, తిరువనన్దాళ్వార్లను, శ్రీరామచంద్రులను, కరుమాణిక్కవరదులను, తిరుమడపళ్ళిని, గరుడాళ్వార్లను, నృసింహస్వామిని; సేనముదలియాళ్వార్లను, హస్తగిరిని, దానిపై పుణ్యకోటి విమానమును, ఆవిమాన మధ్యమున శ్రీదేవి భూదేవులతో కలసి వేంచేసియున్న శ్రియ: పతియగు వరదరాజస్వామిని సేవించుచున్నాను.)

శ్లో. కమల నివేశితాంఘ్రి కమలం కమలారమణం
   ఘనమణి భూషణద్యుతి కడారిత గాత్రరుచిమ్‌|
   అభయగదా సుదర్శన సరోరుహచారుకరం
   కరిగిరి శేఖరం కమపి చేతసి మేవిదధే"||

ఆననముగానున్న కమలము నందు శ్రీపాదములుంచినవాడును, శ్రియ:పతియు, గొప్పవైన మణిభూషణముల చేత ప్రకాశించిన తిరుమేని గలవాడును, అభయ హస్తము, గదా, సుదర్శనము ధరించినవాడును, హస్తిగిరి శిరోభూషణమునైన వరదరాజస్వామిని మనస్సునందు ధ్యానించుచున్నాను.

ఈక్షేత్రస్వామి విషయమైన కొన్నిస్తోత్రములు.
శ్రీదేవరాజాష్టకము-తిరుక్కచ్చినంబి
శ్రీవరదరాజస్తవమ్-కూరత్తాళ్వాన్
శ్రీవరదరాజ పంచాకత్-శ్రీమద్వేదాంతదేశికర్
శ్రీహస్తగిరి మాహాత్మమ్‌-శ్రీమద్వేదాంత దేశికర్
శ్రీదేవరాజ మంగళా శాసనము-శ్రీమన్మణవాళమామునులు. వరదాభ్యుదయం, హస్తిగిరిచంపువు-శ్రీవేంకటాధ్వరి; వరదరాజస్తవమ్-అప్పయ్యదీక్షితులు.
<poem>
శ్రీకాంచీనగరమున వేంచేసియున్న పెరుమాళ్ల విషయమైన స్తోత్రము.
దీపప్రకాశ సరకేసరి విద్రుమాభ వైకుంఠవామన యథోక్తకరాష్టబాహూన్|
అన్యాన్ సుధాభ ఫణి పాణ్డవదూత హేమ వర్ణాదిమాన్ పరగురు:క్రమశస్సిషేనే||

తిరుత్తణ్‌గా దీప ప్రకాశకర్, వేళుక్కై నృసింహస్వామి, పవళవణ్ణమ్‌ పవళవణ్ణస్వామి, వైకుంఠనాథ పెరుమాళ్, తిరువెஃకా యథోక్తకారి; అష్టభుజం ఆదికేశవన్, నిలాత్తిజ్గళ్ తుండత్తాన్, ఊరగమ్‌ ఉలగళన్ద పెరుమాళ్, పాడగమ్‌ పాండవ దూతర్‌, పచ్చవణ్ణర్ మొదలగు సన్నిధులను పరవరమునులు క్రమముగా సేవించిరి.

మార్గము: మద్రాసు నుండి, తిరుపతి నుండి బస్ రైలు వసతి కలదు. ప్రసిద్ధ నగరము. సకల సౌకర్యములు కలవు.

                                               94