ఈ పుట ఆమోదించబడ్డది

66. తిరువల్లవాళ్- 8 (తిరువల్లాయ్)

(శ్రీవల్లభక్షేత్రం)

శ్లోకము : ఘంటాకర్ణ సరోవరేణ కలితే శ్రీ వల్లవాళ్ పత్తనే
        భాతి ప్రాజ్ముఖ మండిత స్థితి యుతః కోలప్పిరాన్ నామకః
        వైమానం చతురంగ మాప్య గృహిణీం శెల్వక్కొళుందాహ్వయాం
        ఘంటాకర్ణ నిరీక్షితః కలిజిత స్తుత్య శ్శఠారే ర్మునేః

వివ: కోలప్పిరాన్ - శెల్వత్తిరుక్కొళుందు తాయార్ - ఘంటాకర్ణ సరస్సు - తూర్పుముఖము - నిలుచున్నసేవ - చతురంగకోల విమానము - ఘంటాకర్ణునకు ప్రత్యక్షము - నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు ' తెన్ నగర్ ' సుందరమైన దివ్యదేశము (తి.వా.మొ. 5-9-11) అను విలక్షణమైన తిరునామము కలదు. ఈ క్షేత్రము ద్వాపర యుగమున శ్రీకృష్ణునిచే ప్రతిష్ఠింపబడినదని చెప్పుదురు. చతురంగ విమానమునకు వెనుక చక్రత్తాళ్వార్ వేంచేసియున్నారు. ఈ సన్నిధి లోపలకు స్త్రీలను రానీయరు. వెలుపలనుండియే సేవింపవలెను. కానీ ధనుర్మాసములో ఆర్ద్ర నక్షత్రమునాడు, మేష సంక్రాంతినాడు మాత్రము లోపలకు రానిత్తురు.

సర్వేశ్వరుని పొందుటకు ఉపాయము సర్వేశ్వరుడే. ఆతడే ఉపాయమని మనకు తెలియజేయునది ఆస్వామి కృపాగుణమే. ఆకృపాగుణమునే నమ్మాళ్వార్లు తిరువాయిమొழி (5-6-9)లో పెరుమానదు తొల్లరుళే (సర్వేశ్వరుని స్వాభావికమైన కృప) యని కృపాగుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రమునకు శ్రీవల్లభక్షేత్రమనియు తిరునామము కలదు.

మార్గము: కొల్లం - ఎర్నాకుళం రైలు మార్గంలో తిరువల్లాయ్ స్టేషన్ నుండి 5 కి.మీ. బస్సు వసతి కలదు. ఇచట సత్రములో దిగి బస ఏర్పాటు చేసికొని తిరుచ్చెంకున్ఱూరు వాని సమీప క్షేత్రములు సేవింపవచ్చును. తిరుచ్చెంకున్ఱూర్ కు ఉత్తరమున 10 కి.మీ. దూరములో ఈ క్షేత్రము కలదు. తిరువణ్డ్‌ణూరుకు 8 కి.మీ.

పాశురము: మానేయ్‌నోక్కు నల్లీర్; వైగులుమ్‌ వినై యేన్మిలియ,
         వానార్ వణ్‌కముకు; మ్మత్తు మల్లిగై కమழுమ్‌
         తేనార్ శోలైగళ్ శూழ்; తిరువల్లవాழுఱైయుమ్‌
         కోనారై; యడియే; నడికూడువ తెన్ఱుకొలో -
               నమ్మాళ్వారు - తిరువాయిమొழி 5-9-1.

83