ఈ పుట ఆమోదించబడ్డది

2. ఇరండాం ఆయిరం

1. పెరియ తిరుమొழி
2. తిరుక్కుఱున్దాణ్డకం
3. తిరునెడున్దాణ్డగం

3. మూన్ఱా మాయిరమ్(ఇయఱ్పా)

1. ముదల్ తిరువన్దాది
2. ఇరణ్డాం తిరువన్దాది
3. మూన్ఱాం తిరువన్దాది
4. నాన్ముగన్ తిరువన్దాది
5. తిరువిరుత్తం
6. తిరువాశిఱియం
7. పెరియ తిరువన్దాది
8. తిరువెழுక్కూత్తిరుక్కై
9. శిఱియ తిరుమడల్
10. పెరియ తిరుమడల్

సూచన "ఇరామానుక నుత్తన్దాది" యను భగవద్రామానుజముని విషయకమైన ప్రబన్దమును కూడ ఈ సహస్రంలో చేర్చారు.

4. నన్గా మాయిరమ్

1. తిరువాయ్ మొழி

ఈ రీతిని ద్వాదశ దివ్యసూరుల దివ్య కీర్తనలతో ఈ నాలాయిర దివ్య ప్రబన్దమేర్పడినది. వీటిని శ్రీవైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవైష్ణవాలయములయందును తమ గృహముల యందును అనుసంధించు చుందురు. దేశభాషలోని ఈ కీర్తనలకు మతపరముగ ఇంతటి ఉన్నత స్థానము లభించుట ముదావహము. ప్రమాణ మూర్థన్యములైన ప్రబస్థములు దివ్య ప్రబస్థములు. ప్రమాతృ మూర్థన్యములైన క్షేత్రములు దివ్య క్షేత్రములు. భగవంతునికి సంబంధించినవి ఏవి మాత్రం దివ్యములుకావు? భగవన్తుడు తానే భగవద్గీతలలో "జన్మ కర్మ చ మేదివ్యమ్" అన్నాడుగదా. అంతేకాదు భగవన్తుని దర్శింపగల నేత్రమును "దివ్యందదామి తే చక్షు:" అంటూ దివ్య నేత్రమని అన్నాడు గదా ఈ 'దివ్య' పదము శ్రీవైష్ణవ సంప్రదాయమున విరివిగా విశిష్ట పదార్థ వాచకముగా ప్రయోగింపబడు చుండును.