ఈ పుట ఆమోదించబడ్డది

51. శిరీవరమంగై 11 (నాంగునేరి)

(వానమామలై)

శ్లో|| తోతాద్రౌ వర పంకసార స్సంశోభి తేంద్రాబ్జినీ
    రమ్యే నందన వర్ధనం సముపయన్ వైమాన మైంద్రాసనః |
    దేవ్యా శ్రీ వరమజ్గనామ యుతయా తోతాద్రినాథః కు, మా
    నీళా, సేనప తార్ష్య చామర ధరా సూర్యేందుభీ రాజతే ||

శ్లో|| భృగు రోమశ మౌనిభ్యాం మార్కండేయ మహర్షిణా |
    బ్రహ్మణాపిచ దృష్టాంగ శ్శఠారాతి మునిస్తుతః ||

వివ:- వానమామలై పెరుమాళ్ - తెయ్‌వనాయకన్ (దేవనాయకన్) - శిరీవరమజ్గై తాయార్ - తోతాద్రి - శేత్తుత్తామరై పుష్కరిణి, ఇంద్రపుష్కరిణి - నంద వర్ధన విమానము, తూర్పు ముఖము - కూర్చున్నసేవ - శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సేన ముదలియార్ (విష్వక్సేనులు) పెరియ తిరువడి (గరుత్మాన్) చామరములు ధరించిన కన్యలు, సూర్యుడు, చంద్రుడు, వీరందరితో కలసి వేంచేసియుందురు. భృగు, రోమశ, మార్కండేయ మహర్షులకు, బ్రహ్మకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే:- ఇచట వేంచేసియున్న తాయార్ పేరుమీదనే ఈ క్షేత్రమునకు "శిరీవరమజ్గై" యని పేరు ఏర్పడినది. ఇచట పెరుమాళ్లను పునరుద్ధరించు సమయమున భూమినుండి ఎత్తునపుడు దెబ్బతగులుటచే ప్రతిదినము తైలముతో తిరుమంజనము జరుగును. ఆ తైలము సకల వ్యాధి నివారకము. అష్ట స్వయంవ్యక్త క్షేత్రములలో ఇది యొకటి. ఇచట గల వానమాలై మఠము జగత్ ప్రసిద్ధము.

సింధుదేశపురాజు కుశాసనమహర్షిచే శపింపబడి శునకస్వరూపుడై "శేత్తుత్తామఱై" పుష్కరిణిలో స్నానమాడి పూర్వరూపము నందెను. ఇచ్చట శఠారిలో నమ్మాళ్వార్ల తిరుమేని (విగ్రహము) వేంచేసి యుండుట విశేషము. ఊర్వశి, తిలోత్తమ అను దేవకన్యలు తపమాచరించి భగవానుని అనుగ్రహమున చామర కన్యకలుగా వేంచేసియున్నారు. మణవాళమామునుల స్వర్ణముద్రిక ఇచట (ఉంగరము) కలదు. తులా మాసం మూలా నక్షత్రమున వానమామలై జీయరుస్వామి దీనిని ధరించి శ్రీ పాదతీర్థమును అనుగ్రహింతురు.

నమ్మాళ్వార్లు "నోత్తనోన్బు" అను తిరువాయిమొழிలో (5-7-10) ఆఱెనక్కు నిన్పాదమే (నీ శ్రీ పాదములే నాకు ఉపాయము) ఓ దేవ నాయకా ! ఏ విధమైన ఉపాయములేని నాకు శ్రీ పాదములనే ఉజ్జీవనోపాయముగా ప్రసాదించితివి. దీనికి నేనేమి ప్రత్యుప కృతిని గావించెదను. నాయాత్మ కూడ నీదేగాన దానిని కూడ