ఈ పుట ఆమోదించబడ్డది

48. శ్రీవిల్లి పుత్తూరు 8

శ్లో. దివ్యే ముక్కళ తీర్థ సుందరతటే శ్రీ విల్లి పుత్తూర్ పురే
   శ్రీమత్సంశన దేవయాన నిలయ: ప్రాచీముఖ స్సంస్థిత:||
   భాతిశ్రీ వటపత్రశాయి భగవాన్ శ్రీ గోదయా సంస్తుత:
   శ్రీమద్విష్ణుహృదా ప్రశస్య విభవో మండూక యోగీక్షిత:||

వివ: వటపత్రశాయి పెరుమాళ్-రంగమన్నార్, ఆండాళ్ తాయార్-ముక్కళ తీర్థము-సంశన విమానము-తూర్పుముఖము-వటపత్ర శయనము. రంగమన్నార్ నిలచున్న సేవ-మండూక మహర్షికి ప్రత్యక్షము. పెరియాళ్వార్, ఆండాళ్ కీర్తించినది.

విశే: పెరియాళ్వార్ ఆండాళ్ అవతరించిన దివ్యదేశము. మిధునం స్వాతి పెరియాళ్వార్ తిరునక్షత్రం, కర్కాటకం పుబ్బ, ఆండాళ్ తిరునక్షత్రం పది దినములు అతి వైభవముగా జరుగును. కన్యా శ్రవణం తీర్థోత్సవం. ఇచ్చట పెరియాళ్వార్లు పెంచిన నందనవనము, ఆండాళ్ అవతరించిన స్థలము. కణ్ణాడి కిణర్ (ఆండాళ్ ముఖము చూచుకొన్న బావి)కలవు. ఈ దివ్యదేశమునకు 20 కి.మీ దూరములో కాట్టళగర్ సన్నిధి, 5 కి.మీ దూరములో శ్రీనివాసన్ సన్నిధి, 24 కి.మీ దూరములో తిరుత్తణ్‌గాల్ క్షేత్రము కలవు. మిధునమాస ఉత్సవములో 5వ రోజు ఉదయం రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసన్, తణ్‌గలప్పన్ వేంచేయగా పెరియాళ్వార్లు మంగళాశాసనం చేయుదురు. నాటి రాత్రి ఆండాళ్ హంసవాహనారూడులై వేంచేయగా పెరుమాళ్లు అందరు గరుడ వాహనముపై వేంచేయుట సేవింపదగినది.

పంగుని ఉత్తరా నక్షత్రమున ఆండాళ్‌కు తిరుక్కల్యాణం జరుగును. ఈ సన్నిధిలో రంగమన్నార్ పెరుమాళ్లకు కుడివైపున ఆండాళ్; ఎడమవైపు గరుడాళ్వార్ వేంచేసియున్నారు.

ఆండాళ్ ప్రార్ధన వలన రంగమన్నారును రాజగోపాల రూపములో తీసుకొని వచ్చిన గరుడాళ్వార్ పెరుమాళ్లతో ఏకాసనమున వేంచేసి యున్నారు.

వటపత్రశాయి సన్నిధిలో ఆదిశేషన్, నాభికమలమున బ్రహ్మ, శ్రీదేవి భూదేవి; విల్లి; పుత్తర్ అను కిరాత రాజులైన భక్తులు కలరు. విల్లి; పుత్తర్ అను కిరాత రాజులచే కట్టబడుటచే ఈక్షేత్రమునకు విల్లి పుత్తూరను పేరు వచ్చినది.

ఇచట ప్రతి నిత్యము పెరియాళ్వార్లకు తిరుమంజనము జరుగును. పిమ్మట పెరియాళ్వార్ పెరుమాళ్లకు మంగళా శాసనం చేతురు. పెరియాళ్వార్ సన్నిధి ప్రక్కనగల నందన వనములో ఆండాళ్ సన్నిధి వేరుగా కలదు. శ్రీరంగములో వలె

                                       60