పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోనున్న శ్రీరంగనాయకస్వామివారిని జయవిజయలతో కూడ తెచ్చి ప్రతిష్టించి అక్కడ రంగపతి పేట కట్టించి సోల్ససమేతు శ్రీరంగనగరమని చుట్టు పొలిమేరిస్తంభములు వేయించి పై దుర్గానికి వాయవ్యమూలను మిరియాలచుట్టు? మీదను బురుజు కట్టించి మిరియాలబురుజు అని పేరు పెట్టించి 1538 నుండి 1540 వరకు మూడు సం॥ ప్రభుత్వం చేసెను. తానీశా, అలంగీరు వారి పరియంతం దుర్గములలో కిల్లేదార్లను ఉంచి హవేలీ గ్రామాలు వారి క్రింద ఉంచడమున్నూ, మిగతా సమతులు అమీళ్ల పరంగా ఉంచుతూ 1121 ఫసలీవరకు జరిగినది. ౧౧౨౨ ఫసలీలో నవాబు ముచరాజ ఖాను.....మృత్తుజానగరు మూడు...... విభాగించెను. అప్పుడు ఈ జిల్లా క్రింద 18 గ్రామాలు ఉంచి జమీందార్లకు సావరాలు ముడుతూ ఉండేటట్లుగా ఏర్పాటు చేసెను. తర్వాత ఆషబ్ షా నవాబు నిజాముల్ ముల్క్ బహద్దరుగారు సుభా అధ్యక్షులై జాజావాదుల్లా మొలతరము ఖానుడు బాలకృష్ణ మొదలయినవారికి అమీలు యిచ్చిరి. వారు వచ్చి అల్లకల్లోలముగా రాజ్యమును సరిచేసి దేశముఖి దేశ పాండ్యలవల్ల సుంకములు తీసికొంటు వచ్చినారు. తరువాత సాహెబు జావాగారు పరిపాలించిరి. తరువాత వీరి కుమారులు నజర్ జంగ్ ప్రభుత్వం వహించి 1160 ఫసలీలో పరాసువారి పరం చేసెను. తరువాత బసాలద్ జంగ్ దివాను అయిన రాజాబలవంతు ఇంద్రజిత్తు బహద్దరుగారికి ఖిల్లాదారు పని ఇచ్చి పంపగా వారు వచ్చి నల్గురు జమీందార్ల వ్యవహారం తానే చేసికొంటూ ఉండగా ముశ్చఫీలు ముశ్ నాభాముశే లాలి మొదలయిన పరాసువారు పెళ్లూరి రామయ్యగారిని మంత్రిగా యేర్చరచి వ్యవహరించిరి. ఆరవీటినుండి తద్దిఖానుడు మేస్తరుది వీలువచ్చి జమిందార్ల పరంగా వ్యవహరించిరి, ఇంతలో టిప్పుసుల్తాను తరపున గండికోటనుంచి మీరు సాహెబుగారు 6000 గుఱ్ఱాలతో వచ్చి దోపిడి జరిపెను. తరువాత గోలకొండనుంచి పంపబడ్డ సాహెబు వచ్చి జమిందార్ల నేర్పాటు చేసి గుంటూరు సుబా చేసి ఏడు సంవత్సరములు పరిపాలించిరి. 1177 పసలీలో... వారు వచ్చి 1177వరకు 3 సం॥ పరిపాలించిరి. 1200 ఫసలీలో ఈ