పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్దోషంబుల ప్రకారము. 57. రథవాహోపాఖ్యానము. 53. షణ్ముఖకుండల పద్మవరాట భుజంగచక్రపంచక లక్షణపలసూత్రంబు లుపన్యసించుట. 54. దివ్యాస్త్రప్రయోగార్హశరలక్షణములు, తత్పూజానిరూపణంబును. 55. అమోగాస్త్రసంభవము, 56. ధీయువధ. 51. దివ్యాస్త్రగర్వప్రకారము. 58. అమోఘాస్త్రము పరంపరానుగ్రహముగా భూలోకంబునకు వచ్చుట.

వ్యూహఖండము - పంచమాశ్వాసము.

1. అక్షౌహిణీసంఖ్య. 2, సమరంబులకు బయనంబగు సేనాలక్షణంబులు. 3. భటఘోటకరిరథాదుల స్వరూపప్రకటనము. 4. అతిరథ మహారధ సమరథార్ధరథులగుణంబులు. 5. రథీజమనోజ్ఞత్వకౌశలవిశేషంబులుగల సారథులచందము. 6. ఉపసైన్యంబగు బేడుదండున దీపించుతెఱగు. 7. మిత్రవ్యూహనామనిర్దేశము. 8. మహావ్యూహంబు లొడ్డెడువిధము, 9. పోటుమానసు లెక్కటికయ్యంబులకు జోళ్లు గట్టి పెనంగుమార్గము. 10. అసిచర్ముల యుద్ధము. 11. కుంతాయుధులసమరము. 12. మల్లరణము. 13. చక్రాయుధుల కథనము. 14. గదాధరుసంగ్రామము. 15. అశ్వవిద్వేషము. 16. వారణవిరోధము. 11. అర్ధరథ సమరథ మహారథా తిరథికుల యుద్ధచమత్కారము. 18. అర్ధరథాదుల నైజంబుల ప్రకటనము.

కడపటి దగుధర్మఖండ మిందు ముద్రితము గాలేదు, గాన దానివిషయసూచి యిందు చేరలేదు. ఈ గ్రంథము ధనుశ్శాస్త్రవిషయమున సంస్కృతగ్రంథము లన్నింటిని మించినది. దీనికి మూలమగు సంస్కృతగ్రంథమేదో తెలియరాలేదు. ఇందు ధనుర్వేదగ్రంథగర్తల పేళ్లు తత్సంప్రదాయాదులు చాల జెప్పబడినవి.

కృతిపతి

ఈవని కోదండరామస్వామి.

కృష్ణానేని తిరుమల మాణిక్యారాయప్రభుఁడు ధనుర్విద్యావిశేషములు వివరింపఁగాఁ దదాస్థానకవి యగు కృష్ణమాచార్యుఁడు