పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

పుడమిపుఁడున్ ధనాఢ్యుఁడును భూరిబలుండు శౌర్యవంతుఁడున్
గడుదృఢపాణి (యున్నయినఁగాని) యెడంబడ దశ్వమేధ మొం
డడరఁగఁ జేయఁ దన్మఖమునందుల పుణ్యఫలంబు నందఁగా
నడుగుడుగశ్వమేధ మగునాజిమొనం జని చావు సేగియే.

సంస్కృతగ్రంథముల యాంధ్రీకరణము లయినను భారతాదులలోను దేసిరచనలగు కుమారసంభవాదులలోను యుద్ధతంత్రవిశేషములు వ్యూహనామములు ఆయుధనామములు ప్రాకృతరూపములతో నధికముగా నున్నవి. అవి కర్ణాటాంధ్రసమానములుగా నున్నవి. అంతేకాక యుద్ధగణిత భరతనాట్యాది శాస్త్రపారిభాషికపదములు మహారాష్ట్ర ప్రాకృతమున నున్నవి. ఆఱ్నూఱేండ్లు నిర్వక్రముగా రాజ్యమేలిన చాళుక్యులనాటనో అంతకు బూర్వము సాతవాహనులనాటనో యవి యట్లు నెలసియుండవచ్చును. సభాపతివచనమున బత్తీసాయుధములపే ర్లిట్లున్నవి. అసి, ముసల, ముద్గర, రోహణ, కణయ, కంపణ, శిల్లు, భల్లాతక, భిండివాల, కరవాల, కుంత, కోదండ, కఠార, తోమర, పరశు, త్రిశూల, వజ్రముష్టి, గదాతౌది, లాంగూలంబులు, నతళము, వంకిణి, చక్రము, సబళ, యీటె, యినుపకోల, సెలకట్టె, పట్టెసము, ప్రకూర్మము, నఖమయూరము, దండ, నాసంబులు.

ధనుశ్శాస్త్రవిషయకములైన సంస్కృతగ్రంథముల తీరిట్లుండఁగాఁ ధనుర్విద్యావిలాసముగాక శ్రీ పాకలపాటి రాజగోపాలరాజ ప్రణీతమగు దెలుఁగున నిప్పుడు ప్రసక్త మయిన ధనుశ్శాస్త్రము ఆద్యభ్యాస పరికర వ్యూహ ధర్మఖండములని యైదుఖండములు గలిగి యనేక ధనుశ్శాస్త్రరహస్యార్థములతో గర్భితమై ముద్రితమై కానవచ్చుచున్నది. కాని యందు తుదిఖండమగు ధర్మఖండము గానరాదు. అది యెందుచేతనో ముద్రణమున కెక్క దయ్యెను. క్రీ. 1811వ సంవత్సరమున ధనుశ్శాస్త్రమును మందపాటి వెంకటపతి రాజుగారి దగ్గఱ శుశ్రూషించి నేర్చుకొనె నట. ధనుశ్శాస్త్రరహస్యార్థములు వారికి స్వయముగ జ్ఞానదృష్టికి గోచరింపఁగా నా గంథ్రమును వారు రచించిరట. ఆ గ్రంథమున ధనుర్విద్యావిలాసము