పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

11


తంత్రసారమెల్ల దనమీఁదికిఁ దెచ్చుకొని యాయన హింసాపక్షమును నిర్వీర్య మొనర్చినాడు. అహింసాపక్షమునకు సర్వాంతర్యామియై విజయము చేకూర్చుచున్నాడు. భారతీయుల మూలమున నిది పరిస్పుటమై ప్రజ్వరిల్లినతర్వాతనే లోకము దీనిప్రాభవమునకు జోహారు లర్పింపఁగల్గును.

ధనుర్వేదము యజుర్వేదమున కుపవేదమట. చరణవ్యూహమున నిట్లున్నది.

“యథా ఋగ్వేదస్యోపవేది ఆయుర్వేదః చికత్సాశాస్త్రమ్
యజుర్వేదస్యోపవేదో ధనుర్వేదో యుద్ధశాస్త్రమ్
సామవేదస్యోపవేదో గంధర్వవేద స్సంగీతశాస్త్రమ్
అధర్వవేదస్యార్థశాస్త్రం నీతిశాస్త్రం శస్త్రశాస్త్రమ్
విశ్వకర్మాదిప్రణీత శిల్పశాస్త్రమ్
ఇతి భగవాన్ వేదవ్యాసః స్కందః కుమారోవా౽హ "

విశ్వామిత్రప్రణీతమగు ధనుర్వేదగ్రంథమున నీవిషయ మిట్లు గలదు॥ అధ ధనుర్వేదో నిరూప్యతే, స చ పాదచతుష్టయాత్మకో విశ్వామిత్రప్రణీతః, ఆరౌ బ్రహ్మణా ప్రజాపతయే రుద్రాయ చప్రోక్తో రుద్రేణ విశ్వామిత్రాయ విశ్వామిత్రేణ మనవే పురుహూతాదిభ్య ఉపదిష్టః సహిపాదచతుష్టయాత్మక ఉపవేదః తత్ర ప్రథమః పాదః దీక్షాప్రకారః. ద్వితీయః పాదస్సంగ్రహః, తృతీయపాద స్సిద్ధ్యాత్మకః, చతుర్థః ప్రయోగపాదః , తత్ర ప్రథమపాదే ధనుర్లక్షణ మధికారి నిరూపణం చ కృతం, ధనుశ్శబ్దశ్చాపరూఢోపి చతుర్థా యుద్దే ప్రవర్తతే, ముక్త మముక్తం ముక్తాముక్తం యంత్రముక్త మితీ ముక్తంచేతి అముక్తం ఖడ్గాదిః ముక్తాముక్తం శల్యావాంతరభేదాదిః, యంత్రముక్తం శరాది తత్రా ముక్తం శస్త్రముచ్యతే. తదపి బ్రాహ్మ వైష్ణవపాశుపత ప్రాజాపత్యాగ్నేయాది భేదాదనేకవిధం, ఏవం సంధి దైవతేషు చతుర్విధా యుద్ధేష్వధికారః క్షత్రియకుమారాణాం తదనుయాయినాం చ సర్వేషాం చతుర్థా పదాతిరథగజతురంగరూపా దీక్షాభిషేక శకున మంగళకరణాదికం చ ప్రథమ