శ్రీరస్తు.
దేసింగు రాజు కథ.
కథాప్రారంభము.
శ్రీ కరముగ గణనాథు పదములు చెలువుగా సేవించి ప్రాకటపద్మజు రాణిని చాలా భక్తితోడదలచి ముదముతో హరిహర పర మేష్ఠులను మదిలో నర్చించి సదయులైన శ్రీ గౌరీవాణులు సంప్రీతితో నెంచి వరకవులగునా వాల్మీ కాదులు వందనములు చేసి గురుతరముగ సద్గురువులు నెల్లను గోక్క బూజజేసి ఈవసుధను పెరుగువురవాసుడ నింపుమీద నేను రావూర్వేంకటసుబ్బయాఖ్యుడను రంజితంబుగాను సంతసమున దేసింగురాజుకథ చక్కగ జెప్పెదను మిత నీభువిలో నందరునిది విస్మయమందగను సురపతి నారద సంవాదంబిది చోద్యంబుగనిపుకు వరుసగ నది యెట్లన్నను దెల్పెద సరవితోడ వినుడు.
(దేవేంద్రుడు కొలువైయుండగా నారదుడు వచ్చుట.)
నా కాధిపుడగు పోకారియుతా నధిక భోగమునను తేకువతోడను సింహాసనమున తేజగొల్ల గాను సురగరుడోరగ సిద్ధ సాధ్యులు సూటిగ గొల్వగను సరగున రంభాద్యప్సరలప్పుడు సరసతనాడగను మురియుచుఫణిపతులెల్ల నుగొడుగులు గగీమెతొ పట్టగను పరమాద్భుతముగకి న్నెరులెల్ల ను మరిమరి పొగడగను డంబుమీరతుంబుర నారదులు నంబరమున బాడ