ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376.

దర్బారుల చరిత్రము


తోడి యూ రేగింపు పౌరవాత్య సంపదయిట్టిదని బాహాటముగఁ జాటుచుండెనఁట.

ఈదర్బారు సమయమున సప్తమైడ్వర్డు చక్రవర్తి ప్రజల కనురాగవాక్యములం దనప్రతినిధి ముఖమున నంపెను. ఈ దర్బారునకంటే సప్తమైడ్వర్డు చక్రవ ర్తిగారు 1908వ సంవ త్సరము నవంబరు నెల 4వ తేది సామ్రాజ్య పంచాశ ద్వాషి కోత్సవ సమయమున మనకనిపిన ఈ క్రింది వాక్యములుగల సందేశము వలన నెక్కుడు మనకు స్మరణీయులయి యున్నారు. “' 'మొదటినుండియు ప్రతినిధి స్థాపనా పద్ధతి క్రమక్రమ ముగ ప్రచారమునకు తేఁబడెను. అపద్ధతిని నివేకముతో " " పొంగింప సమయము వచ్చినదని నాప్రతినిధియగు గవర్నర్ జెనరలు గారికిని తక్కిన నా మంత్రులకును తోఁచి యున్నది. బ్రిటిష్ పరిపాలన చే వర్ధిల్లిప్రోత్సాహ పఱుఁబడిన యభిప్రాయ ములు గలవారగు మీలో ముఖ్య తరగతులవారు పౌరత్వ సమానత్వమును శాసన నిర్మాణ రాజ్య పరిపాలనముల దుముక కొంత యెక్కువ స్వాతంత్ర్యమును కోరెదరు. ఆ కోకను వివేకముతో నెర వేర్చుటచే ప్రకృతాధికార బలములు దృడ ములగునుగాని క్షీణింపపు. పరిపాలనము జరపు నుద్యోగస్తులు, అట్టి పరిపాలనమునకు లోఁబడిన వారి తోడను, దానివిషయ మై జన సామాన్యాభి ప్రాయమునకు ప్రేరకు లై దాని ప్రతిఫలిం పఁ జేయు వారితోడను, ఎడ తెగని సాంగత్యము కలిగియుండు