ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బటూటాఢిల్లీ వర్ణన

11

.

దీనియందు మేళవమంది యున్నవి. దీని గోడలకు సమానమగు నవి లోకమున మఱి యెచ్చటను గానము. హిదూస్థానమున నిద్దియె విశాలతమము హిందూస్థానమున నేల, మహమదీయ మతము వ్యాపించిన పౌరవాత్య దేశముల నెల్ల యనియే చెప్పు వచ్చును. నాలుగునగరము బొక్కటితో నొక్కటి చేరి యీ నగరమయియున్నది. దీని కోటగోడల వెడలుపు పదునెకండు మూరలు. ..ఇందులను మసీదు మిక్కిలి గొప్పది. కట్టడపు వైశా ల్యమునను సొంపును దానిని జయిం చున దింకొకటుండదు. ఢిల్లీ ముహమ్మదీయులకు లోఁబడక మున్ని ది హిందువుల 'ఎల్ బుర్ ఖానా' యను దేవాలయముగ నుండెడిది. తరువాత నిది మసీ దుగ నుపయోగింపఁబడెను. దీని యంగణము నందొక ఖానా గలదు. మహమదీయ నగరములఁ దెచ్చటను దీనికిఁ బ్రతివచ్చు నది లేదు. దీని పైనుండి క్రిందికిఁ జూచిన వయోవంతులగు మను ష్యులు చిన్న బిడ్డలవ లెఁ గానుపింతురనిన దీనియౌన్న త్యము దెలియఁగలదు, ఆయా వరణమునుదే యొక స్థూల స్తంభము గలదు. సప్త ఖనులనుండి దీనినిగట్టుటకు శిలలు గొనిరాఁ బడెనఁట. దీని పొడవు ముప్పది మూరలు చుట్టుకొలత యెనిమిది మూరలు. ఇది యుత్యాచ్భతముగదా" అని బటూటా వ్రాయు చున్నాడు. ఈ స్తంభ మశోకుని స్థంభమని తోచుచున్నది. శ. 1351 --ఫిరోజుషా ప్రస్తుతము హుమాయూను సమాధి యెల్లగఁ గల ఫిరోజా బాదును గట్టెను. అతని కాలమునఁ బ్రజలు