ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

మైసూరు రాజ్యము.


దాఁటులు వైచుచువచ్చెనఁట. దానింజూచిఅచ్చటి యాచార్యుల డీసణునకు “హొయి! సణ' యనుచు నొక సలాకి నంది చ్చెనఁట. ఇతఁడు దానితో నేసి వ్యాఘ్రమును జంపుటవలన నీవంశమువా రికి హోయిసణులని పేరు వచ్చెనందురు. వీరి పతాకము శార్దూల పతాకమగుటకుఁగూడ నిదియె కారణముగ నెన్నఁ బడుచున్నది. ఈవంశ ఫుఁ బ్రథమసృపాలురు జైనమతస్థులు. హోయిస ణులు ప్రారంభదశయందు చాళుక్యులకు సొమంతులుగ నుండిరి. వీరికి మొదటి ముఖ్యపట్టణము ద్వార సముద్రము (ఇప్పటి బేలూరు తాలూకాలోని హళేబీడు). ఈవంశమునకు మూలవురుషుఁడగు హొయిసణుని గుజించి మనకంత విశేషముగఁ దెలియదు. కాని యాతని కుమారుఁడగు వినయాదిత్యుఁడు మలపులను అనఁగా కొండ దొరలను జయించి కొంత రాజ్యమును ఆక్రమించి విస్తీర్ణ మగు రాజ్యము నేలినట్లు దెలియుచున్నది. అతఁడు చెఱు వులు త్రవ్వించుట యందును దేవాలయములు కట్టించుట యందును మిక్కిలి శ్రద్ధఁ జేసెనని వ్రాయఁబడియున్నది. ఆలయ ముల గోడలకయి ఇటుక కాల్చుటకుగాను మట్టి త్రవ్విన ప్రదేశ ములు తటాకములుగ నేర్పడెననియు రాళ్లకయి భేదింపఁబడిన పర్వతములు నేలతో సమమయ్యెననియు వర్ణింపఁబడి యుండుట వలన నీతఁ డెంత యాస క్తితోఁ బనిచేసినదియు మన మూహింపఁ గల్గుదుము. ఇతఁడు కట్టించిన హళేబీడులోని హోయిసణేశ్వర దేవాలయము నేఁటికిని ఈతని కాలమందలి శిల్పకళా చాతుర్య