ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

మైసూరు రాజ్యము.


భారము వహించిన రాజులకు శతకర్ణియనునది బిరుదు నామ ముగఁ గాన్పించు చున్నది. శాలివాహన వంశపు శాఖలోని వారగు నీ శతకర్ణుల కాలము క్రీII పూII "రెండు శతాబ్దములు ను అటుతరువాత రెండు శతాబ్దములును నని చెప్పవలసి యు న్నది. శాలివాహనుల శక్తి తగ్గిపోవుట తోడనె మైసూరు సంస్థాన ప్రదేశమున న నేకు లితరవంశములవారు వేరు వేరు భాగ ముల నాక్రమించుకొనిరి.

కదంబులు

క్రీస్తునకు వెనుక మూఁడన శతాబ్దమునకు వచ్చునప్పటికి మైసూరు సీమలో వాయవ్య దిగ్భాగమున కదంబులు రాజ్య మేలుట గానవచ్చు చున్నది. వీరితోఁగూడ మైసూరున రాష్ట్ర కూటులును మహా బలులును పల్లవులునుగూడఁ జూపట్టు చున్నారు. ఇంచుమించుగ నీ కాలమునకు వచ్చునప్పటికి నిశ్చ యాధారములు వలసినన్ని పొడఁగట్ట నారంభించు చున్నవి. కదంబుల రాజ్యమున పశ్చిమ మైసూరును, ఇప్పటి ఉత్తర కన్నడము జిల్లాయును తుళువమనంబడు దక్షిణక న్న డము జిల్లాయును జేరియుండెను. వీరి రాజధాని వనవాసి. కదంబనామమును గుఱించి చిత్రమగు కథయొక టి గలదు. పరశురాముఁడు సాగరమునుండి హైగ * [1]తుళువముల సంపాదించిన కొంతకాలమునకుఁ దరువాత నీనూతన భూప్రదే .................................................................................

  • ఉత్తరకన్నడ జిల్లాకివి ప్రాచీన నామము.