ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఢిల్లీ న గ ర చ రి త్రము.


అతఁ డిద్దానిని తృణీకరించి రెండు సంవత్సరములకు మున్ను గోరీని ప్రాణావ శేషునిఁ జేసి వదలిన స్థలమునందే మరల యుద్ధమునకు సన్నద్ధుఁడయి “నీకు నీ ప్రాణముల పై యాశ లేదేని నీ సైనికుల కైననుండదా ! వారినైన సుఖంబుగ నుండనీ రాదా” యని పరిహసించుచుఁ బ్రత్యుత్తర మంపెను. గోరీ విశ్రమమునకుఁ గొంతకాలమడిగెను. ఆ యొడంబడికను నమ్మి రాజు సైన్యములు హాయిగ నిదురఁ జెంది యుండెను. అట్టి తరుణమున గోరీ మోసముచే దన భటులను హిందు స్త్రీలమీదికి గవి యించెను. హటాత్తుగ పైఁబడిన మహమ్మదీయ మహాంభోనిధిని దరియింప రాజుబలము లసమానశూరత్వము బోరిరి గాని ఫలము లేదయ్యె. పృధ్వీ రాజును మహమ్మదీయులు - చెఱవట్టి చంపివేసిరి. ఢిల్లీ నగరము మహమదుగోరిబాని సీడగు కుతు బుద్దీను వశమయిపోయెను. ఇంతటితో భరతఖడంబు హిందూ సామ్రాజ్య మంతరించెను.

బానిస వంశము.

క్రీ. శ. 1206 న సంవత్సరమున ఢిల్లీ రాజధానిగం చేసి కొని కుతుబుద్దీను రాజ్యము ప్రారంభించి తన పేర బరగు మసీ దును గట్ట మొదలిడెను. కుతుబ్ మినారును నిర్మించెను.. ఇతని యల్లుఁడగు నల్తమషు దీనిని బూర్తిగావించెను. ఈ వంశములోని నాసిరుద్దీను కాలమున రాజ్యములో పలను "వెలుపటను దిరుగు బాటులును కలహములును జరిగెను. కాని యితడు దనకంటె