ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృధ్వీరాజు.

5

చంద్రగుప్తుడు ఢిల్లీనగరమున నిలిపిన లోహ స్తంభముమీఁది శాసనమునుబట్టి యిదియె గుప్తరాజులకుఁగూడ ముఖ్యపట్టణముగ నుండెనని తెలియుచున్నది. గుప్తులకుఁ దరువాత నిది రాజధానిగా నుండినదియు లేనిదియుఁ జెప్పవలనుపడదు. కనింగ్హాముగారి వ్రాతననుసరించి తోమర వంశమునందలి యనంగ పాలుఁడు పుట్టునప్పటికి ఢిల్లీ నామాన శేషమై యుండెనని తెలియవచ్చుచున్నది.

అజమీర్ పట్టణము.

అతఁడు దీనికి మరలఁ బ్రాణమువోసి ప్రజలను జేర్చినట్లును తోఁచెడిని. ఇది పదునొకొండవ శతాబ్దమునందలి సమాచారము.

పృధ్వీరాజు.

ఇతని సంతతి వారొక శతాబ్దకాలము పరిపాలించి యజిమీరు రాజ్యాధిపతులగు చౌహణులలోని వీసల దేవునిచే