ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీ లా జి.

215


ఒక ' పాగా'కు, అనఁగా నొక సైన్యమునకు, నధి కారిగ నియ మింపఁబడెను. నాఁటినుండియు నతఁడు గుజరాతు పై కెత్తి పోవుటయం దుద్యుక్తుఁడయి వాసిఁగాం చెను. రమారమి ఆసమ యముననె అంతః కలహముల వలన నతఁడు తన నివాసస్థాన మును నవాపురమునుండి 'సోనఘడు' నకు మార్చి అచ్చటి నుండి కార్యములు నడుప వలసిన వాఁడయ్యెను. కావున “సోనఘుడు' గాయిక వాడులను బోషించిన దాదియనుటలోఁ దప్పుండదు. ఇంతియ కాక 1776 వఱకు బహుకాలము వారికదియె రాజధానిగ నుపచరించు చుండెను.

కొన్ని సంవత్సరముల కాలము ‘పీలాజి. ఇతర మహా రాష్ట్ర నాయకులను తోడు చేసికొని ‘సూరతు అట్టావీసి అనఁగా సూరతునకుఁ జేరిన ఇరువది యెనిమిది చిన్న భాగ ములను దాఁకి కప్పమును సంపాదించుకొనుచుండి 1728 వ సంవత్సరమున సూరతు నగరము నే ముట్టడించి అచ్చటి పరి పాలకుని బరాజితు నొనర్చి గుజరాతునుండి క్రమముగ కప్ప మునదిమి పుచ్చుకొనఁ జొచ్చెను. పాడ్రా, భాని, భాయాలీ గ్రామముల దేశాయీల సాయమున నతఁడు మాహీ నదివఱ కును గుజరాతును గొల్లం గొట్టెను. 1725 వ సంవత్సరమున కృతయు నితఁడు బరోడా, నాందోడు, చాంపనీరు, బ్రోచి, సూరతు మండలములకు హక్కు స్థాపించుకొని “సోనఘడు, వచ్చి చే రెను. ఆ సంవత్సరమున నే సేనాపతీయును ' పీలాజి' స్వాధీ