ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

బరోడారాష్ట్ర ము,


ఇంకొకకొంత : పచ్చిక బయళ్లుగను నున్నది. ఆ సంస్థానవర్ణన ' నింతటితో 'నాపి చరిత్రకుఁ దరలుదము.

నామప్రశంస.

ఈ సంస్థానమునకు బరోడా యను పేరు వచ్చుట దీని రాజధాని నామమువలననే. రాజధానికి ఆ పేరు మాత్రమే కాక నీర క్షేత్రము లేక వీరవాటి యనియును, చందనవతి యనియును నామములుం డెడివి. ప్రేమానందుఁడను పదు నేడ వశతాబ్దపు, గుజరాతి కవి వీర వాటియను పేరుతోఁగూడ వడో దరొయను పదమును వాడియున్నాఁడు. అయినను ఏ పేరు ఎప్పుడు వచ్చినదియును మనము నిర్థారణగఁ జెప్పఁజాలము, ఆంగ్లేయ ప్రవాసికులును వర్తకులును మాత్రము మొదటి నుండియు దీనిని జోడీగా అనియే పిలుచుచున్నారు. కావున బరోడా నామమనే మనము గ్రహింతము. . ఇది 'వటోదర ' యొక్క వికారనబు చెప్పవలసి యున్నది. దీని వలన నీ నగరము వటవృక్షముల ,మధ్యనుండుటం జేసి ఇద్దానికా పేరు సిద్ధించిన దని ఏర్పడుచున్నది. ఈయుత్పత్తియే సరియైన దనుటకు బరో డా నగరమును జుట్టుకొని యుండు మహావటవృక్షము లేసాక్షి. ఇట్టి పవిత్ర వృక్షములవలన, నామముగాంచిన ఈపవిత్ర సం స్థాన చరిత్రము పదు నెనిమిదవ శతాబ్దారంభమునఁ బ్రారంభ మగుచున్నది .