ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైసర్గిక స్వరూపము.



నమును డాంగులును, తూర్పున ఖాండేషు జిల్లాయును ఎల్లలని చెప్పవచ్చును. ఇఁక కాథియవాడలోని అమేలి ప్రాంతము భిన్న భిన్న ముగ నున్నది. జునగడు మున్నగు కాథియవాడ సంష్ణా నములు అందలి ముఖ్యభాగమును జుట్టుకొని యున్నవి. మఱి యొక భాగమగు ఓఖాముండలము పశ్చిమసముద్ర తీరమునను కచ్చిఖాడీ తీరమునను వ్యాపించి భూపార్శ్వమున నవానగరసం స్థానము చేఁ జుట్టఁబడియున్నది. ఇందే ద్వారకా నగరముగలదు.

నైసర్గిక స్వరూపము.

ఈ సంస్థానపు విస్తీర్ణము 8099 చదరపుమైళ్లు. జన సంఖ్య 19,52,692. ఈ సంస్థానమున ఎత్తగుపర్వత పంక్తులు గాని విస్తారమగు నడవులు గాని లేవు. అమేలి ప్రాంతము నందలి 'గిర్' అడవి మాత్రము గుజరాతు దేశపు సింహమున కింకను ఆటపట్టగుటం జేసి కొంచెము ప్రసిద్ధిఁ జెందియున్నది. ఈ సంస్థానమునఁ బ్రవహించు నదులలో ముఖ్యమయినవి సబర్మతి, మాహి, నర్మదా తపతులు. ఇవియైనను బరోడా ప్రాంతమున ఒక కొంత భాగమునకే ఉపయోగకారులు. ఇవి కాక చిన్న చిన్న ఏళ్ల నేకములుగలవు. 'చెఱువులు బావులును మెండుగనున్న వి. ఖండములు ఖండములుగ నుండుటంబట్టి బరో డాసంస్థానపు భూసారమును మొత్తముగ వర్ణింప నలవిగాదు. ! కొంతభాగము నల్ల రేగడి భూమిగను మఱికొంత ఎఱ్ఱమట్టి ప్రదేశముగను వేరొకకొంత సముద్రతీరమయి ఇసుక నేలగను