ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

హైదరాబాదు సంస్థానము.


" పిదప నతఁ డొనర్చిన సర్వకార్యములను గవర్నరు , జనరలుగారు 'విద్యావంతుడును అనుభవవంతుఁడునునగు ఆం గ్లేయ ప్రభుత్వపు మిత్రుడని' : వనివర్ణించియున్నారు.”

ఈ అను వాదమునందలి యొకటి రెండు విషయములను మాత్రము పూర్వ పక్షము చేయవలసియున్నది. సంస్కరింప బడిన సైన్యములను గుఱించి సర్ సాలార వ్వానిని దనసం స్థాన మునకు స్వాతంత్ర్యము సంపాదింప సమకట్టిచే ర్చెననుట మిక్కిలి 'పొరపాటు. '1857 వ సంవత్సరపు తిరుగుబాటు సమయమున నైజాము సైన్యము ఆంగ్లేయుల సాహాయ్యార్థమై ఉత్తర హిందూ 'స్థానమున కనుపఁబడియెను. అప్పుడు హైదరాబాదునందుండిన యల్లకల్లోలమిదివఱకే వర్ణింపఁబడియున్నది. అట్టి సందర్భము లలో సర్ సాలారు తగిన సైనిక సాహాయ్యము లేక కార్యములు గడుపశక్తుఁడయి యుండునా యనుట మనము యోజింపవలసి యున్నది. ఈ యోజన కొక్క ప్రత్యుత్తరమే సాధ్యము. సర్ సాలారు దన శక్తిలో గలవఱకు భటులను సిద్ధము చేసికొని తీరవల సినవాఁడయ్యెను. కావున నతఁ డాసమయమున హైదరాబాదు నందు చెల్లా చెదరయియుండిన బలములన్నిటిని సంస్కరించి “పటాలముగ నేర్పఱచుకొ నెను.పటాలమునకు అధిపతులుగ ఐరో పియనులు నేమింపఁబడిరి. అది యే 'సంస్కరింపఁబడిన సైన్యము 1 [1] - అనఁబరగునది. కావున నీ సైన్యమును సర్ సాలారు దురభి ..............................................................................

1.

  1. J. D. B. Gribble 'Tivo native states'.